సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ని అభినందించి ప్రశంసా పత్రం అందజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల పట్టణానికి చెందిన గాంధీ నగర్ కు చెందినా చిలగాని అనూహ్య అనే మహిళా తండ్రి శంకర్ మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలగా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఆర్ముడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డమిది శ్రీనివాస్ ని జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంసా పత్రం అందజేషిన జిల్లా ఎస్పీ.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీఆర్ ,ప్రథమ చికిత్స, బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి తెలుసుకుంటే విధినిర్వహణలో భాగంగా సామాన్య ప్రజలకు మెడికల్ ఎమర్జెన్సీలు సంభవించినప్పుడు సాధ్యమైనంత వరకు వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 District Sp Akhil Mahajan Congratulated Constable Srinivas For Saving Life By Pe-TeluguStop.com

కాబట్టే జిల్లాలోని సిబ్బందికి , అధికారులకు, గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలు ఏర్పటు చేసి వారికి కూడా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.చాలా వరకు తక్షణ సౌకర్యాలు లేక సహాయం లేకపోవడం వల్ల గుండెపోటు వివిధ ప్రమాదాల వల్ల ప్రజలు మరణిస్తున్నారాని, ఇలాంటి సమయాల్లో, బాగా శిక్షణ పొందిన పోలీసు అధికారులు , సిబ్బంది , సామాన్య ప్రజలు నిజంగా ఒక ప్రాణాన్ని రక్షించడంలో సహాయ పడగలడని దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న సిబ్బందికి, విలేజ్ కమిటీ సభ్యులకు సీపీఆర్ , ప్రథమ చికిత్స పై శిక్షణ ఇవ్వడం జరిగిందని , ఈ శిక్షణ ఫలితమే ఒక నిండు మహిళ ప్రాణం నిలబెట్టిందన్నారు.

ఎస్పీ వెంట ఆర్.ఐ మాధుకర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube