కొన్నేళ్ల క్రితం వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ సౌత్ ఇండియాలో మరే ఇండస్ట్రీ అయినా కూడా ఇండియా మొత్తం మీద తమ సినిమా రిలీజ్ చేస్తే చూసిన దాఖలాలు లేవు.బాహుబలి పుణ్యమా అని మన సినిమా ఫ్యాన్ ఇండియా చిత్రాలను తరికెక్కిస్తుంది.
సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి.కానీ ఇప్పుడు ఇది సరిపోదు.
పాన్ ఇండియా నుంచి విశ్వ విజేతలుగా ఎదగాలని మన సౌత్ ఇండియన్ స్టార్స్ ఆరాటపడుతున్నారు.దానికోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు.
ఏళ్ల తరబడి జుట్టు, గడ్డం పెంచుకొని విభిన్నమైన లుక్కులో కనిపించడానికి ఆరాటపడుతున్నారు.పైగా ఆస్కారే తమ లక్ష్యంగా చాలామంది హీరోలు పనిచేస్తున్నారు.
ఇంతకి అలా ఏళ్ల తరబడి ఆలా జుట్టు, గడ్డం పెంచుకుంటూ విభిన్నమైన లుక్ కోసం పని చేస్తున్న హీరోలు ఎవరు ? వారు తీస్తున్న సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
![Telugu Allu Arjun, Goat, Kanguva, Prithviraj, Pushparaj, Indian Heros, Surya, Ta Telugu Allu Arjun, Goat, Kanguva, Prithviraj, Pushparaj, Indian Heros, Surya, Ta](https://telugustop.com/wp-content/uploads/2024/04/south-indian-heros-diiferent-looksc.jpg)
నిన్నటికి నిన్న గోట్ లైఫ్( Goat life ) అనే సినిమాతో పృథ్వీరాజ్( Prithviraj ) సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది.అది తెలుగులోనే కాదు నేషనల్ వైడ్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.ఈ సినిమా కోసం పృథ్విరాజ్ ఇంతక ముందు ఎప్పుడు పడనంత కష్టం అనుభవించాడు.
ఇసుకలో, ఎడారి ప్రాంతంలో జుట్టు పెంచుకొని విపరీతమైన కష్టాన్ని అనుభవించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే అది ఘనవిజయ సాధించి ఆయన కెరీర్ ని మరొక స్టెప్ ఎక్కించింది.ఇదే దోవలో పుష్పరాజ్ కూడా సందడి చేయబోతున్నాడు.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్( Allu Arjun ) చాలా ఏళ్లుగా గడ్డం పెంచుతున్నాడు.దీనికి ఫలితంగా పుష్ప మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది.
![Telugu Allu Arjun, Goat, Kanguva, Prithviraj, Pushparaj, Indian Heros, Surya, Ta Telugu Allu Arjun, Goat, Kanguva, Prithviraj, Pushparaj, Indian Heros, Surya, Ta](https://telugustop.com/wp-content/uploads/2024/04/south-indian-heros-diiferent-looksd.jpg)
ఇప్పుడు రెండో భాగం కోసం ఊపిరి సలపని విధంగా షూటింగ్స్, షెడ్యూల్స్ పెట్టుకొని సినిమా కోసం పని చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్ ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడు అల్లు అర్జున్.ఇక తన సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి నటుడు విక్రమ్( Vikram ).ఇప్పుడు తంగలాన్ సినిమా( Tangalan movie ) కోసం ఇంత వరకు ఇండస్ట్రీలో ఎవరు చేయనటువంటి ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు.దానికోసం ఆయన జుట్టు జడలు కట్టిపోయి చూడ్డానికి భయంకరంగా చాలా ఏళ్ల నుంచి అదే లుక్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు.ఈ సినిమా విడుదలైన తర్వాత విక్రమ్ తన సినిమా స్టాండర్డ్స్ పెరుగుతాయని ఆయన ఆశపడుతున్నాడు.
అలాగే మరో తమిళ స్టార్ హీరో సూర్య( Surya ) సైతం కంగువా సినిమాతో తనలోని మరో నటుడిని బయటకు తీసుకువచ్చానని చెబుతున్నారు.ప్రపంచం మార్కెట్ ని సొంత చేసుకోవాలని తహతహలాడుతున్నాడు.