ఇటీవల మలయాళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేయబడి యువత నుంచి మంచి ఆదరణ పొందిన సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమలు చిత్రం మాత్రమే.యువతకు ఈ సినిమా బాగా కిక్కు ఎక్కించింది.
పరభాష చిత్రమైన కూడా తెలుగులో దీనికి మామూలుగా ఆదరణ లభించలేదు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించడం విశేషం.ఇలా గతంలో అనేక సినిమాల క్లైమాక్స్ లు, ఫ్రీ క్లైమాక్స్ లు ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించగా అవి ఘన విజయం సాధించినవి ఉన్నాయి, అలా ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ ల ద్వారా హిట్ అయిన సినిమాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్థికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తొలి ప్రేమ :
( Tholiprema ) యువత హృదయాల్లో చేరగకుండా ఉండిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది తొలిప్రేమ.ఈ సినిమా క్లైమాక్స్ ఆసాంతం రక్తి కట్టించింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ గా నటించారు.
ఒక్కడు :
( Okkadu ) ఇక మహేష్ బాబు, భూమిక నటించిన ఒక్కడు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా చాలా ఏళ్ల పాటు నిలబడింది.ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ లో ముఖ్యమైనవి అన్ని ఎయిర్పోర్ట్స్ లో చిత్రీకరించడం విశేషం.
![Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya, Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya,](https://telugustop.com/wp-content/uploads/2024/04/tollywood-movies-which-are-shot-in-airportb.jpg)
వీడోక్కడే :
( vidokkade )ఇక తమన్నా, సూర్య కలిసి నటించిన వీడొక్కడే సినిమాలోని ముఖ్యమైన ఒక సన్నివేశాన్ని ఎయిర్ పోర్ట్ లోనే చిత్రీకరించారు.చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో హీరోని ఎయిర్ పోర్ట్ లో ఇంటరాగేట్ చేసే విధంగా ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి.
![Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya, Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya,](https://telugustop.com/wp-content/uploads/2024/04/tollywood-movies-which-are-shot-in-airportc.jpg)
ప్రయాణం :
( Prayanam )ఇక ఆసాంతం ఎయిర్పోర్ట్ లోనే షూటింగ్ జరిగిన ఏకైక సినిమా ప్రయాణం. మంచు మనోజ్( Manchu Manoj ) ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం.ఈ సినిమా మొత్తం ఎయిర్ పోర్ట్ లోనే షూటింగ్ జరిగింది.
ఇది ఒక విభిన్నమైన ప్రయత్నమనే చెప్పుకోవచ్చు.
![Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya, Telugu Bhumika, Mahesh Babu, Mallimalli, Manchu Manoj, Okkadu, Prayanam, Surya,](https://telugustop.com/wp-content/uploads/2024/04/tollywood-movies-which-are-shot-in-airportd.jpg)
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు :
( Malli Malli Ediraniroju )నిత్య మీనన్, శర్వానంద్ హీరో హీరోయిన్స్ గా నటించిన మళ్లీమళ్లీ ఇది రాని రోజు చిత్రం ఎంతో మంది ప్రేక్షకులకు హృదయాలను ఆకట్టుకుంది.ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తిగా ఎయిర్ పోర్ట్ లోనే షూట్ చేయడం జరిగింది.ఎంతో ఎమోషనల్ గా ఉండే ఈ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.