గత సీజన్ తో పోల్చుకుంటే ఈ ఐపిఎల్ సీజన్( IPL season ) చాలా రసవత్తరంగా సాగుతుంది.ఇక ఇప్పటివరకు ప్రతి టీం కూడా ఐదు మ్యాచ్ లు ఆడి ఉండడం వాటిలో కొన్ని టీమ్ లు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని టీములు డీలాపడుతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్( Rajasthan Royals vs Punjab Kings ) టీమ్ లా మధ్య ఒక మ్యాచ్ జరుగునుంది.అయితే ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో ఓడిపోయి మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో మంచి విజయాలను సాధించింది.
ఇక చివరిగా గుజరాత్ టీం( Gujarat Team ) మీద ఆడిన మ్యాచ్ లో ఓటమి పాలు అవ్వడం అనేది రాజస్థాన్ టీం కి ఒక భారీ నష్టం గా మారింది.అందుకే ఇప్పుడు జరిగే ఈ మ్యాచ్ తో తమ గెలుపు బావుటను ఎగరవేయాలనే ధృడ సంకల్పం తో రాజస్థాన్ టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడితే అందులో 2 మ్యాచ్ లో గెలిచి, మూడు మ్యాచ్ లో ఓడిపోయింది.అయితే ఈ టీం కూడా తమదైన రీతిలో వరుస విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగింది.
అయినప్పటికీ కొన్ని మ్యాచ్ ల్లో గెలుస్తూ, మరికొన్ని మ్యాచ్ ల్లో ఓడిపోతూ ముందుకు సాగుతుంది.ఇక హైదరాబాద్ లో జరిగిన గత మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పరాజయం పాలైంది.
అయితే ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది.కానీ చివర్లో హైదరాబాద్ బౌలర్లు చేసిన మ్యాజిక్ కి పంజాబ్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.ఇక పంజాబ్ టీమ్ మొదటి మ్యాచ్ ఢిల్లీ టీం మీద గెలిచారు.ఇక ఇప్పటివరకు రెండు విజయాలను అందుకున్న ఈ టీమ్ ఈ మ్యాచ్ లో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది.
ఇక ఈ టీమ్ లో కూడా సామ్ కరణ్, శిఖర్ ధావన్ ( Sam Karan, Shikhar Dhawan ) లాంటి స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారు.అయినప్పటికీ ఈ టీమ్ వరుస సక్సెస్ లను అందుకోవడంలో ఫెయిల్ అవుతుంది.
ఇక రాజస్థాన్ టీమ్ లో బట్లర్, సంజు శాంసన్, రియన్ పరాగ్ లాంటి స్టార్ ప్లేయర్లు టీమ్ కి మంచి విజయాలు సాధించి పెడుతున్నారు.ఇక అయినప్పటికీ ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడం ఈ టీమ్ కి కొంతవరకు అవమానకరమైన విషయమనే చెప్పాలి.ఇక ఇప్పుడు మరోసారి తమ గెలుపు బావుటాని ఎగరవేసి విజయాల పరంపరను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు…అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కి 60% గెలిచే అవకాశం ఉంటే, పంజాబ్ కింగ్స్ కి 40% గెలిచే అవకాశం ఉంది.