రెండో విజయాన్ని కైవసం చేసుకున్న డిల్లీ..సత్తా చాటిన బౌలర్లు...

ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా లక్నో వర్సెస్ ఢిల్లీ టీమ్ లా మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో ను చిత్తు చేస్తూ ఢిల్లీ ఘన విజయం సాధించింది.ఇక ఈ మ్యాచుకు ముందు లక్నో టీమ్ విజయం సాధిస్తుందని అందరు అనుకున్నప్పటికీ, ఢిల్లీకి మాత్రం లక్నో ను భారీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

 Delhi Won The Second Victory , Ipl Season 17, Lucknow Vs. Delhi, Lucknow Team, K-TeluguStop.com

ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం( Lucknow Team ) నిర్ణీత 20 ఓవర్లకి 167 పరుగులు చేసింది.

అయితే ఈ టీంలో ఎవరు కూడా భారీ స్కోర్ చేయకపోవడం విశేషం…ఇక డిల్లి బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్డీప్ యాదవ్ ( Khalil Ahmed, Kuldeep Yadav )ఇద్దరు కలిసి లక్నో టీమ్ ను భారీ దెబ్బ కొట్టారనే చెప్పాలి.ఇక ఇప్పటికే కుల్దీప్ యాదవ్ వరుస మ్యాచ్ లో వికెట్లు తీస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక ఖలీల్ అహ్మద్ కూడా ఢిల్లీ టీం విజయంలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నాడు.

ఇక ఇంతకు ముందు ఢిల్లీ చెన్నై లాంటి ఒక బలమైన టీమ్ ను ఓడించింది అంటే దానికి కారణం ఖలీల్ అహ్మద్ అనే చెప్పాలి.

ఇక కుల్డీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ ఇద్దరి వల్లే ఈ మ్యాచ్ ఢిల్లీ చేతులోకి వచ్చేసింది.ఇక 168 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పృథ్వి షా, మెక్ గుర్క్, రిషభ్ పంత్ రాణించడంతో ఈ మ్యాచ్ లో ఈజీగా వీళ్ళు విజయం సాధించారు.ఇక ఇది ఇలా ఉంటే ఢిల్లీ రెండో విజయాన్ని సాధించి వాళ్లు కూడా ప్లె ఆఫ్ రేస్ లో ఉన్నాము అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు.

ఇక లక్నో మంచి విజయాలను అందుకుంటుంది అనుకున్న సమయంలోనే వాళ్లకి ఈ ఓటమితో భారీ దెబ్బ తగలడం అనేది నిజంగా వాళ్ల దురదృష్టమనే చెప్పాలి.ఇక మొత్తానికైతే ఈ ఐపీఎల్లో ఢిల్లీ మరోసారి తమ విజయ భావుటాను ఎగరవేసింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube