అన్నీ ఇంటికే : జనాలకు బాబు గారు బంపర్ ఆఫర్

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తన వయస్సును లెక్క చేయకుండా, ఎండ వేడి సైతం పట్టించుకోకుండా, ఎనుకల ప్రచారం నిర్వహిస్తూ విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు.కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్న బాబు ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

 Babu Garu's Bumper Offer For All The People At Home, Chandrababu, Tdp, Ysrcp, Ap-TeluguStop.com

జనాల్లో మార్పు తీసుకువచ్చి, వారంతా టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేలా చేసుకునేందుకు బాబు చాలా తంటాలే పడుతున్నారు.దీనిలో భాగంగానే వైసిపి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలను అయితే చూసుకుని గెలుపు ధీమాతో ఉందో, ఆ తరహాలోనే సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే ప్రజలకు అందిస్తామని పదేపదే తన పర్యటనలో చంద్రబాబు చెబుతున్నారు.

ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో టిడిపి అభాసుపాలు కావడం, వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటి వద్దే తీసుకునే అవకాశం లేకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా అడ్డుకోవడంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, తదితర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పెన్షన్ల విషయంలో అనేక హామీలు ఇస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Pavan Kalyan, Ysrcp-Politics

టిడిపి అధికారంలోకి రాగానే ఈ మూడు నెలల పింఛను చెల్లించడానికి సిద్ధమని, ఈ లోగా ప్రభుత్వం ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి రాగానే అంత కలిపి ఒకేసారి చెల్లిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.నెలకు 4వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని, అంతా కలిపి జూలై నెలలో అధికారంలోకి రాగానే చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.వరుసగా మూడు నెలలు తీసుకోకపోయినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెబుతున్నారు.

పింఛన్ల పంపిణీ తాను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పానని, అయినా ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెట్టిందని చంద్రబాబు చెబుతున్నారు.కావాలని పేదలను సచివాలయానికి రమ్మన్నారని, చివరకు వృద్ధులు, రోగులను కూడా సచివాలయానికి వచ్చి పింఛను తీసుకోవాలని చెప్పారని, ఇది మంచి విషయం కాదని తాను చెప్పినా వినిపించుకోలేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Pavan Kalyan, Ysrcp-Politics

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి( Chief Secretary Jawahar Reddy ) , ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి ( Dhanunjay Reddy, Muralidhar Reddy )పెన్షన్లు పంపిణీ సక్రమంగా చేయకపోవడానికి కారణం అని చంద్రబాబు ఆరోపణలు చేశారు.దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి పైనే పెడతామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఈ అవినీతి దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలేందుకు తాము మూడు పార్టీలు కలిసి కూటముగా ఏర్పడ్డామని, తమను అధికారంలోకి తీసుకు వస్తే అన్ని సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందేలా చూస్తామని హామీలు ఇస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube