జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయభేరి యాత్ర నేటి నుంచి మళ్లీ మొదలు పెట్టినన్నారు.ఈ మేరకు అనకాపల్లి( Anakapalli ) కి ఈరోజు రాబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా అనకాపల్లి కి చేరుకుని డైట్ కాలేజీ సమీపంలో ఓ ప్రైవేట్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలి ఫ్యాట్ కు చేరుకుంటారు.అక్కడ నుంచి రింగ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ ( Nehru Chowk Junction )వరకు పవన్ వారాహి విజయ భారీ యాత్రను కొనసాగిస్తారు.
నాలుగు గంటలకు నెహ్రూ చౌక్ కూడలి లో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి పవన్ ప్రసంగించబోతున్నారు.
పవన్ పర్యటనకు సంబంధించి భారీగానే జనసేన( Janasena ) ఏర్పాట్లు చేసింది.భారీగా జనాలు పవన్ రోడ్ షో కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేపట్టారు.రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న కొన్ని కీలక నియోజకవర్గల్లో పర్యటించే విధంగా జనసేన ఏర్పాట్లు చేస్తుంది.
ఈ ఎన్నికల్లో వైసీపీకి అవకాశం లేకుండా చేయాలనే లక్ష్యంతో పవన్ ఉన్నారు.దానికనుగుణంగానే వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల పైన పవన్ దృష్టి పెట్టారు.ఇక అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొరటాల రామకృష్ణ ( Koratala Ramakrishna )ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆయనకు మద్దతుగానే పవన్ కళ్యాణ్ ఈరోజు వారాహి విజయ భేరి యాత్రను ( Varahi Vijaya Bheri Yatra )చేపట్టనున్నారు.ఈ రోడ్డు షో లో అనకాపల్లి లో నెలకొన్న సమస్యలపై పవన్ మాట్లాడబోతున్నారట.ఎక్కడికక్కడ తాను పర్యటించిన ప్రాంతాల్లో స్థానిక సమస్యలను హైలెట్ చేసి వైసిపిని టార్గెట్ చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే నాలుగు రోజులు పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్, జ్వరం కారణంగా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు అనకాపల్లిలో పర్యటించిన అనంతరం మళ్లీ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.