వాలంటీర్ల ఎఫెక్ట్ మామూలుగా ఉండదా ? 

ఏపీలో వాలంటీర్ల( AP volanteers ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  ఎన్నికల విధులకు, వాలంటీర్లను దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

 Is The Effect Of Volunteers Normal, Ap Government, Ap Cm Jagan, Ap Volanteers, T-TeluguStop.com

అలాగే పెన్షన్ల పంపిణీ , రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సేవలు బంద్ అయ్యాయి.

ఇప్పటి వరకు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఉచితంగా తమ ఇళ్ల వద్దే అందుకుంటూ వస్తున్నా.జనాలకు ఇప్పుడు ఆ వ్యవస్థ తాత్కాలికంగా రద్దు కావడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థను జనం బాగా స్వాగతించారు.కానీ ఇప్పుడు ఎన్నికల నిబంధనల పేరుతో వారిని పక్కన పెట్టడంతో ఆ ఎఫెక్ట్ రాజకీయంగా ఎవరిపై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

వాలంటీర్ల వ్యవస్థను మొదటి నుంచి విపక్ష పార్టీలన్నీ తప్పు పడుతూనే వస్తున్నాయి.ఒక దశలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం,  దానిపై కేసులు పెట్టడం వంటివన్నీ జరిగాయి.

ప్రస్తుతం వృద్ధులు,  వికలాంగులు, వితంతువు లకు వాలంటీర్ల ద్వారా తమ ఇంటి వద్దనే పెన్షన్ అందుకునే అవకాశం లేకపోవడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.విపక్ష పార్టీలే ఇదంతా చేశాయని విషయం జనాల్లోకి వెళ్ళింది.

Telugu Ap Cm Jagan, Ap, Ap Volanteers, Chandrababu, Jagan, Janasena, Pavan Kalya

జగన్ ప్రభుత్వం( Cm YS JAGAN ) తీసుకువచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ బాగా సక్సెస్ అయింది.వృద్ధులు వికలాంగులు వివిధ రోగాలతో బాధపడుతున్న వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు.ఏపీ వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.కరోనా వంటి సమయంలోనూ వారు అందించిన సేవలు జనాల నుంచి ప్రశంసలు లభించాయి.ప్రతి 50 ఇళ్ల కు ఒక వాలంటీర్ ఉండడంతో తమకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అవసరం ఉన్నా .వాలంటీర్ల కు చెప్పి వారి ద్వారా తాము ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పనులు చేయించుకునే విధానానికి జనాలు బాగా అలవాటు పడ్డారు.5000 రూపాయల గౌరవ వేతనంతో వారు విధులు నిర్వహిస్తుండడం పైన జనాల్లో సానుభూతి ఉంది./br>

Telugu Ap Cm Jagan, Ap, Ap Volanteers, Chandrababu, Jagan, Janasena, Pavan Kalya

కానీ  కీలకమైన ఎన్నికల సమయంలో ఆ పార్టీలకు ఇవి బాగా డామేజ్ చేసే అంశం.దీంతో అలర్ట్ అయిన విపక్ష పార్టీలు కావాలనే ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విషయంలో రాజకీయాలు చేస్తోందని, అధికారుల ద్వారా ఇళ్ల కే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉన్నా, విపక్షాలు బురదజల్లేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు చేస్తున్నారు.ఏప్రిల్ నెలలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ ( Pensions )లు పంపిణీ కాలేదు  ఇది విపక్ష పార్టీలకు చాలా డామేజ్ జరిగింది .మే నెలలో పోలింగ్ జరగబోతుండడంతో ఆ నెలలో పెన్షన్ ఏవిధంగా పంపిణీ చేస్తారనేది తేలాల్సి ఉంది .దాని ఆధారంగానే పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉండొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube