Realme 12 5G : రియల్ మీ12 5G స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

భారత మార్కెట్లో రియల్ మీ12 సిరీస్ తొలి సేల్ మార్చి 6వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమై మార్చి 10న ముగుస్తుంది.ఈ సిరీస్ లో భాగంగా రియల్ మీ 12 5G,( Realme 12 5G ) రియల్ మీ 12ప్లస్ 5G( Realme 12+ 5G ) స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.ఈ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్లు ఏమిటో చూద్దాం.

 Realme 12 5g Smart Phones To Launch In India Check Price Specifications Details-TeluguStop.com

రియల్ మీ12 5G స్మార్ట్ ఫోన్:

Telugu Realme, Realme Phone-Technology Telugu

ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్ ప్లే తో 2400*1080 పిక్సెల్ రిజల్యూషన్ తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్,950 గరిష్ఠ బ్రైట్ నెస్ తో ఉంటుంది.ఈ ఫోన్ డైనమిక్ బటన్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ 6GB RAM+ 128GB స్టోరేజ్, 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.6GB RAM మోడల్ ధర రూ.16999, 8GB RAM మోడల్ ధర రూ.17999 గా ఉంది.ఈ ఫోన్ 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 6100+5G చిప్ సెట్ పైన పనిచేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు( 45W Fast Charging ) సపోర్ట్ చేస్తుంది.108ఎంపీ శాంసంగ్ HM6 కెమెరా, సెల్ఫి, వీడియోల కోసం 16ఎంపీ కెమెరాను కలిగివుంది.

రియల్ మీ12 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్:

Telugu Realme, Realme Phone-Technology Telugu

ఈ ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్ తో ఉంటుంది.ఈ ఫోన్ 8GB RAM+128GB స్టోరేజ్, 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ లలో లభిస్తుంది.128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20999, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.TSMC 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ కలిగివుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం తో 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.

ఈ ఫోన్ OIS,EIS సపోర్ట్ తో 50ఎంపీ సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా తో ఉంటుంది.తొలి సేల్ లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రియల్ మీ12 ప్లస్ 5G కోనుగోలు చేస్తే రూ.2000 వరకు తగ్గింపు పొందవచ్చు.రియల్ మీ12 5G కొనుగోలు చేస్తే రియల్ మీ వైర్ లెస్ 3ను ఉచితంగా పొందవచ్చు.ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube