ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు సంచలన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
ఇదే సమయంలో పొత్తులు మరోపక్క ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) ఢిల్లీ పర్యటన చేపట్టడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
పరిస్థితి ఇలా ఉండగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన( Chandrababu Delhi Tour ) చేపట్టినట్లు వార్తలు రావడం జరిగింది.ఈ క్రమంలో అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కావడం కూడా జరిగింది.
2014 ఎన్నికలలో గెలిచినట్టు 2024 ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఇప్పటికే జనసేనతో పొత్తు కన్ఫామ్ కావటంతో బీజేపీతో చర్చలు జరిపి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ( Minister Kottu Satyanarayana ) చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ వెళ్లి వచ్చాక చంద్రబాబు ముఖం వాడిపోయిందని ఎద్దేవా చేశారు.
తన అవసరం బీజేపీకి ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని వాస్తవ పరిస్థితులలో బీజేపీ( BJP )ని శాసించే స్థితిలో చంద్రబాబు లేరని విమర్శించారు.ఇదే సమయంలో చంద్రబాబు మోసం చేస్తారని అంతర్మధనం జనసేనలో మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని ఆయనను నమ్మే పరిస్థితిలో కాపులు లేరని మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.