ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) రాష్ట్రవ్యాప్తంగా రాజన్న రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ప్రతి జిల్లాలో ఒక చోట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం కొవ్వూరులో నిర్వహించారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం( YCP Govt )పై సీఎం జగన్ పై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయి.
దళితులను బెదిరించి హత్యలు చేస్తున్నారు.సాక్షాత్తు రాష్ట్ర హోంశాఖ మంత్రి దళితురాలు అయి ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారు.
ఇంకా పదవిలో ఉండి ఏం ఉపయోగం.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దళితులకు రక్షణ అని అన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా.కాంగ్రెస్ రావాలి అని వ్యాఖ్యానించారు.
ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ.ఇందిరమ్మ రాజ్యం రాజన్న సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.
![Telugu Ap, Congress, Job Calendar, Ycp, Ys Jagan, Ys Sharmila, Yssharmila-Latest Telugu Ap, Congress, Job Calendar, Ycp, Ys Jagan, Ys Sharmila, Yssharmila-Latest](https://telugustop.com/wp-content/uploads/2024/01/AP-PCC-Chief-YS-Sharmila-Sensational-Comments-on-YS-Jagan.jpg)
ఇదే సమయంలో ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులపై రాజశేఖర్ రెడ్డి( YS Rajasekkhar Reddy )కి ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది.ఫీజు రియంబర్స్మెంట్( Fee Reimbursement ) అనేది ఆయనకు ఇష్టమైన పథకం.ఆ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు.ఉన్నత చదువులు చదివారు.పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే చదివించడం జరిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కన్న తల్లిదండ్రులే అప్పులు చేసి పిల్లలను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడింది.తీరా చదువుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే.
అవి కూడా రావడం లేదు.ఆనాడు చంద్రబాబు గారు.7వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) విడుదల చేస్తే…జగన్ గారు సిగ్గు లేదా అని విమర్శించారు.తాము అధికారంలోకి వస్తే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేయటం మాత్రమే కాదు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్ని ప్రకటించారు.
మరి ఇప్పుడు జగనన్న గారిని ప్రశ్నిస్తున్నాను.మెగా డీఎస్సీ ప్రకటన ఏమయింది.ఇప్పుడు దగా డిఎస్సి 6000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ప్రతి సంవత్సరము జనవరి మొదటి తారీకున.
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.ఇప్పటివరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారని వైయస్ షర్మిల ప్రశ్నించారు.
ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్( Job Calendar ) విడుదల చేయలేదని రాజన్న రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై వైయస్ షర్మిల మండిపడ్డారు
.