అందరి చర్మ తత్వాలు ఒకేలా ఉండటం అసాధ్యం.కొందరిది పొడిగా ఉంటే.
మరికొందరు జిడ్డు ఉంటుంది.అలాగే ఇంకొందరిది కాంబినేషన్ గా ఉంటుంది.
అయితే ప్రస్తుత వేసవి కాలంలో ఎటొచ్చి జిడ్డు చర్మతత్వం కలిగిన వారే ఎక్కువ సమస్యలను ఫేస్ చేస్తుంటారు.అధిక వేడి, ఉక్కపోత కారణంగా జిడ్డు చర్మం మరింత జిడ్డుగా తయారు అవుతుంటుంది.
ఫలితంగా ముఖం కాంతిహీనంగా, డల్‌గా కనిపిస్తుంటుంది.ఈ క్రమంలోనే అధిక జిడ్డును వదిలించి ఫ్రెష్ లుక్‌ను పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక కివి పండు తీసుకుని పీల్ తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకుంటూ శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల అధిక జిడ్డు తొలగిపోయి ముఖం ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా మెరుస్తుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి పసుపు, ఐదారు టేబుల్ స్పూన్ల కీరా జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పూర్తిగా ఆరిన అనంతరం వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆయిలీ స్కిన్ వారు ఇలా చేసినా ఫ్రెష్ లుక్ తమ సొంతం చేసుకోవచ్చు.