Prime Minister Justin Trudeau : ట్రూడోకు షాక్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్‌లే విజయం, కెనడాలో సంచలన సర్వే

ఇప్పటికిప్పుడు కెనడాలో ఫెడరల్ ఎన్నికలు జరిగితే .గ్రేటర్ టొరంటో ఏరియా ( Greater Toronto Area )(జీటీఏ)లో అధికార లిబరల్ పార్టీకి చెందిన పలువురు ఇండో కెనడియన్ ఎంపీలు, ఒక కేబినెట్ మంత్రి కన్జర్వేటివ్‌ల చేతిలో ఓడిపోవచ్చునని ఓ సర్వే అంచనా వేసింది.

 Conservatives In Position To Win If Polls Held Now In Canada-TeluguStop.com

టొరంటో కేంద్రంగా పనిచేస్తున్న పోలింగ్ సంస్థ మెయిన్ స్ట్రీట్ రీసెర్చ్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఔట్ లెట్ వై మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేసింది.దీని ప్రకారం.పీల్ ప్రాంతంలో 42.3 శాతం మద్ధతుతో కన్జర్వేటివ్‌లు విజయం సాధిస్తారని అంచనా వేసింది.ఇదే సమయంలో పాలక లిబరల్స్‌కు 36.4 శాతం మాత్రమే ఓట్లు దక్కుతాయని పేర్కొంది.

Telugu Kamal Khera, Canada, Greatertoronto, Primejustin, Toronto, Yudhvir Jaswal

ఫెడరల్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జీటీఏ అత్యంత కీలకం.గడిచిన మూడు ఫెడరల్ ఎన్నికల్లో 2015, 2019, 2021లలో బ్రాంప్టన్, మిస్సిసాగా, కాలెడన్‌లను కలిగివున్న పీల్‌లోని రైడింగ్‌లను (భారత్‌లో నియోజకవర్గాల వంటివి) లేబర్ పార్టీ కైవసం చేసుకోవడం ద్వారానే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) మరోసారి అధికారంలోకి వచ్చారు.కన్జర్వేటివ్‌లు ఈ ప్రాంతంలో ఈసారి అడుగుపెట్టడమే కాదు మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి వస్తారని సర్వే తెలిపింది.ఈసారి భారత సంతతికి చెందిన కేబినెట్ మంత్రి కమల్ ఖేరా( Cabinet Minister Kamal Khera ) సైతం ఓటమి పాలయ్యే అవకాశం వుందని పేర్కొంది.కేవలం 29.2 శాతం మద్ధతుతో ఆమె బ్రాంప్టన్ వెస్ట్ నుంచి కనర్జేటివ్ అభ్యర్ధి కంటే 16 శాతం ఓట్ల వెనుకంజలో వున్నట్లు సర్వే తెలిపింది.

Telugu Kamal Khera, Canada, Greatertoronto, Primejustin, Toronto, Yudhvir Jaswal

అయితే బ్రాంప్టన్ ఈస్ట్ రైడింగ్‌లో పార్లమెంటరీ సెక్రటరీ మణిందర్ సిద్ధూ( Secretary Maninder Sidhu ) 17 శాతం ఆధిక్యంలో వుండటం లిబరల్స్‌కు ఊరట కలిగించే అంశం.వై మీడియా ఎడిటర్ ఇన్ చీఫ్ యుధ్వీర్ జస్వాల్ మాట్లాడుతూ.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే .చాలామంది లిబరల్ ఎంపీలు తమ స్థానాలను కోల్పోయే అవకాశం వుందన్నారు.ఇప్పటివరకైతే కన్జర్వేటివ్‌ల వైపే మొగ్గు కనిపిస్తోందని జైస్వాల్ పేర్కొన్నారు.అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది.షెడ్యూల్ ప్రకారం 2025 అక్టోబర్ లేదా నవంబర్‌లో ఫెడరల్ ఎన్నికలు జరుగుతాయి.ద్రవ్యోల్బణం , గృహ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తం కావడం వంటి అంశాలు ట్రూడో ప్రభుత్వానికి ఇబ్బందికి పరిణమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube