నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్ఎస్ యూఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజన్ యాదవ్ డిమాండ్ చేశారు.మంగళవారం ఎన్ఎస్ యూఐ అధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచితి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం అరెస్టు చేయాలని కోరారు.మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని,
వారి తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పిన కూడా ఇంకా మారలేదన్నారు.బాల్క సుమన్ కు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని, ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.ఈకార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ నాయకులు మున్నా అశోక్,ఏర్పుల నాగరాజు, కొండ మహేష్,గౌతమ్ కుమార్,మున్న సందీప్ తదితరులు పాల్గొన్నారు.