గత వారం రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా( Hanuman Movie ) నామ జపమే ఎక్కువగా వినిపిస్తోంది.సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేసింది.
ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ దాటి వేసిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది.దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ( Director Prasanth Varma ) పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగుతోంది.
సినిమా విడుదల అయ్యి దాదాపు 7 రోజులు కావస్తున్నా కూడా ఈ సినిమాను అలాగే ఆదరిస్తూ వస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నెట్టింట ఒక వార్త వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ వార్త ఏమిటి అన్న విషయానికి వస్తే.హనుమాన్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్( Cinematic Universe ) ఉంటుందని ప్రకటించాడు.
అంటే హనుమాన్ లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఒక ఫ్రాంచైజీలో భాగంగా రిలీజ్ చేస్తారు.
తాజాగా వచ్చిన మూవీలో హనుమంతుడి రిఫరెన్స్ ఉన్నట్లు రాబోయే చిత్రాల్లో మన దేవుళ్ల రిఫరెన్సులు ఉండటం పక్కా.అలానే హనుమాన్ చిత్ర క్లైమాక్స్‌లో జై హనుమాన్ అనే మరో సినిమా 2025 లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు.ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి.
మెగాహీరో రామ్ చరణ్.( Ram Charan ) ఆ పాత్రలో నటించే అవకాశాలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కాగా ఆర్ఆర్ఆర్ మూవీలో( RRR ) సెకండాఫ్‌లో రామ్ చరణ్ గెటప్ గుర్తుచేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం హీరోల్లో రాముడి పాత్రలు ఎవరికి సూట్ అవుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.ఒకవేళ చరణ్ గనుక ప్రశాంత్ వర్మ తీసే సినిమాలో రాముడి పాత్ర వేస్తే మాత్రం అది వేరే లెవల్ మూవీ కావొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ వార్తపై ఇప్పుడు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.