తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ( Jabardasth satya sri ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సత్యశ్రీ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు చమ్మక్ చంద్ర.
ఎందుకంటే ఈమె ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్లలో చేసి బాగా పాపులారిటీని సంపాదించుకుంది.తనదైన శైలిలో కామెడీ చేసి లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సత్యశ్రీ.
అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది.జబర్దస్త్ తో పాటు జీ తెలుగులో అదిరింది లాంటి షోలలో చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
![Telugu Jabardasth, Pawan Kalyan, Reject, Sardaargabbar, Sathya Sri, Tollywood-Mo Telugu Jabardasth, Pawan Kalyan, Reject, Sardaargabbar, Sathya Sri, Tollywood-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/12/Jabardasth-tollywood-satya-sri-pawan-kalyan-movie-offer-reject.jpg)
ప్రస్తుతం కమీడియన్ గా ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా సినిమాలలో అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది సత్య శ్రీ.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు సర్దార్ గబ్బర్ సింగ్( Sardaar Gabbar Singh) మూవీలో అవకాశం వచ్చింది.షూటింగ్ దగ్గరికి వెళ్లాను.క్లబ్ లో ఒక డ్యాన్స్ సీన్ ను చేస్తున్నారు.
నాకు చెప్పింది ఒకటి.అక్కడ చేస్తున్నది మరొకటి.
నాకు అది నచ్చలేదు.వెంటనే చేయనని చెప్పి బయటకు వచ్చేశాను.
పవన్ కల్యాణ్( Pawan Kalyan ) గారి మూవీ అయినా కూడా అలాగే వచ్చేశాను.
![Telugu Jabardasth, Pawan Kalyan, Reject, Sardaargabbar, Sathya Sri, Tollywood-Mo Telugu Jabardasth, Pawan Kalyan, Reject, Sardaargabbar, Sathya Sri, Tollywood-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/12/Jabardasth-tollywood-social-media-Sardaar-Gabbar-Singh-satya-sri-pawan-kalyan.jpg)
ఈ విషయాన్ని ఎవరో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) దృష్టికి తీసుకెళ్లారట.వెంటనే ఆయన నన్ను పిలిపించారు.ఎందుకు నటించనని చెప్పారు అని అడిగారు.
నాకు భయం వేసింది సర్.అందుకే చేయనని చెప్పాను.మీది ఏ ఊరు అని నన్ను అడిగారు.తణుకు అని చెప్పాను.కాసేపు మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు.అలాగే వెళ్లేటప్పుడు ఫోటో కావాలని అడిగితే ఇచ్చారు.
నిజానికి నేను ఆయన అభిమానిని, నాతో మాట్లాడిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత ఎక్కువ అయ్యింది అని చెప్పుకొచ్చింది సత్యశ్రీ.నేను కొన్ని సినిమాలలో నటించాను కానీ ఎడిటింగ్ సీన్లలో నేను నటించిన సీన్లు పోయాయి.
కొన్ని సినిమాలలో మంచి మంచి పాత్రలో నటించిన కూడా అవి ఎడిటింగ్ లో పోయాలి అని చెబుతూ బాధపడింది సత్యశ్రీ.