నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
పోలింగ్ కేంద్రంలోని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో గొడవ సద్దుమణిగింది.