ఏపీలోని వైసీపీ ప్రభుత్వపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.
సామాజిక సాధికార యాత్రలు చేసే హక్కు వైసీపీకి లేదని పురంధేశ్వరి విమర్శించారు.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అలాగే ఏపీలోని కరవు ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తారని ఆమె తెలిపారు.ఇప్పటికే ఏపీలోని కరవు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న పురంధేశ్వరి ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.