ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో బిజెపి ,కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ( BJP Congress BRS parties )జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.ఒకపక్క అభ్యర్థుల నామినేషన్ ల గడువు ముగియనుండడం తో , అన్ని పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .
నామినేషన్ లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.మిర్యాలగూడ, సూర్యాపేట , చార్మినార్ , తుంగతుర్తి , పటాన్ చెరువు నియోజకవర్గాల్లో చాలామంది నామినేషన్లు వేయడంతో, ఆయన నియోజకవర్గాల లోని కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రామ్ రెడ్డి , దామోదర్ రెడ్డి ,పటేల్ రమేష్ రెడ్డి ( Patel Ramesh Reddy )నామినేషన్ వేశారు.దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.
సూర్యాపేట టిక్కెట్ కేటాయించకపోవడంతో రమేష్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.రమేష్ రెడ్డి కార్యకర్తలు అనుచరులు ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
![Telugu Brs, Neelam Madhu, Telangana, Viksarao-Politics Telugu Brs, Neelam Madhu, Telangana, Viksarao-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/BRS-party-Telangana-elections-Neelam-Madhu-Telangana-Congress-Telangana-elections.jpg)
మంత్రిని గెలిపించాలని లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు టికెట్ రాకుండా చేశారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాను ఇంట్లో కూర్చున్న గెలిచే పరిస్థితి ఉన్నా, టికెట్ రాకపోవడం వెనక కచ్చితంగా కీలక నేతల హస్తం ఉందని ఆయన మండిపడుతున్నారు .ఇప్పటికే ఇక్కడ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కు టికెట్ కేటాయించినా, ఇప్పుడు ఆయనను కాదని కాటా శ్రీనివాస్ గౌడ్ ( Kata Srinivas Goud ) టికెట్ కాంగ్రెస్ కేటాయించింది.కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వాల్సిందేనని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆందోళన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది.
నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలిచినా అధిష్టానం మాత్రం మధును కాదని శ్రీనివాస్ గౌడ్ ( V Srinivas Goud )కు టికెట్ కేటాయించడం ఇక్కడ రచ్చగా మారింది.రాహుల్ సోనియా గాంధీ దిష్టిబొమ్మలను సైతం మధువర్గం దగ్ధం చేయడంతో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
![Telugu Brs, Neelam Madhu, Telangana, Viksarao-Politics Telugu Brs, Neelam Madhu, Telangana, Viksarao-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/11/BRS-party-Telangana-elections-Neelam-Madhu-Telangana-Congress-V-Srinivas-Goud-Telangana-elections-viksarao-kata-Srinivas-Goud.jpg)
ఈ నేపద్యంలోని నీలం మధు ( Neelam Madhu )స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు .ఈరోజు నామినేషన్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.బిజెపిలోను ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది.వేములవాడలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ వస్తుందని భావించగా, ఈటెల రాజేందర్( Eatala Rajender ) తన అనుచరులు తులా ఉమాకు టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డారు.
దీంతో చివరి నిమిషంలో తులా ఉమకు టికెట్ బిజెపి అధిష్టానం కేటాయించింది.వికాస్ రావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు .ఈరోజు వేములవాడలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వికాస్ రావు సిద్ధమవుతున్నారు.దీంతో ఈ ఇద్దరిలో బి ఫామ్ ఎవరికి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు .దీంతో వేములవాడ టికెట్ విషయంలో బిజెపిలో టెన్షన్ నెలకొంది.అధికార పార్టీ బీ ఆర్ ఎస్ లోను దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
బీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడిన జలగం వెంకట్రావు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా చాటుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
దీంతో అధికార పార్టీకి ఈ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
.