కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాహుల్ గాంధీకి అసలు తెలంగాణ చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు.
పదకొండు సార్లు అధికారం ఇస్తే కాంగ్రెస్ చేసిందేమీ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.పదేళ్లలో దేశంలోనే అత్యధిక జీడీపీ తెలంగాణదని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారన్న ఆయన రాహుల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కారే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.