యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మెక్‌కార్దీని ( Speaker McCartney )అవిశ్వాస తీర్మానం నుంచి తొలగించిన తర్వాత కొత్త స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది.సభలో మెజారిటీ రీత్యా మరోసారి రిపబ్లికన్లకే ఆ పదవి దక్కనుంది.
రిపబ్లికన్ పార్టీ ఇటీవల నిర్వహించిన రహస్య బ్యాలెట్ ద్వారా తమ స్పీకర్ నామినీగా లూసియానాకు చెందిన స్టీవ్ స్కాలిస్‌ను ఎన్నుకున్నారు.అయితే స్కాలిస్ అధికారికంగా స్పీకర్ పదవి చేపట్టడానికి మొత్తం హౌస్ నుంచి మెజారిటీ ఓట్లను పొందాల్సి వుంటుంది.
ఆయన గెలవాలంటే 435 ఓట్లలో కనీసం 217 ఓట్లు రావాలి.ఇదే సమయంలో కొందరు రిపబ్లికన్లు స్కాలిస్‌పై విశ్వాసం చూపకపోవడంతో.ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు.గత శుక్రవారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన ఒహియోకు చెందిన జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ జిమ్ జోర్డాన్‌ను( Jim Jordan ) స్పీకర్ పదవికి నామినేట్ చేశారు.
కానీ ఓటింగ్ సమయంలో రిపబ్లికన్లు స్కాలిస్‌కు అనుకూలంగా ఓటేశారు.కానీ పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా వుండటంతో స్కాలిస్ పోటీ నుంచి విరమించుకున్నారు.
అయితే స్కాలిస్ చేతిలో ఓటమిపాలైన జోర్డాన్ మాత్రం ఎలాగైనా స్పీకర్ పదవి దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు.థర్డ్ ఫ్లోర్ ఓటును సంపాదించేలా ఆయన పావులు కలుపుతున్నారు.వ్యూహాత్మకంగా తాత్కాలిక స్పీకర్‌గా వున్న పాట్రిక్ మెక్‌హెన్రీ( Patrick McHenry ) అధికారాలను విస్తరించడం ద్వారా స్పీకర్ ఎన్నికను ఆలస్యం చేయాలని జోర్డాన్ ప్రయత్నిస్తున్నారు.ఇతని వ్యూహం ఫలిస్తే.
వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఇదే పరిస్ధితి కొనసాగనుంది.తద్వారా ఈ వారం జరిగిన రెండు బ్యాలెట్‌లలోనూ తనకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్ చట్టసభ సభ్యుల నుంచి మద్ధతును కూడగట్టడానికి జోర్డాన్‌కు నెలల పాటు సమయం దొరుకుతుంది.
కానీ ఈ ఆలోచనను అనేకమంది సంప్రదాయవాద రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు మద్ధతు తెలిపేది లేదని కొందరు కీలక సమావేశం నుంచి బయటకొచ్చేశారు.
అయితే ఈ ఉద్విగ్న సమావేశంలో జోర్డాన్ మాట్లాడుతూ.తన పై వ్యతిరేకత చూపుతున్న రిపబ్లికన్లను ( Republicans )ఎలా కలుపుకునిపోవాలో నిర్ణయించుకుంటానని చెప్పారు.స్పీకర్ ఎన్నిక సమస్యపై వారాంతం వరకు సభ పనిచేస్తుందని తాము భావిస్తున్నామని పలువురు ఇతర శాసనసభ్యులు చెప్పారు.ఇదే సమయంలో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ నేత మారియో డియోజ్ బాలార్డ్( Mario Dioze Ballard ) తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు.
సంప్రదాయవాద రిపబ్లికన్ ఎజెండాను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఒక ప్రతిపాదనకు మద్ధతు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.కానీ ఒక ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం తాత్కాలిక స్పీకర్‌గా వున్న మెక్ హెన్రీ జనవరి 3 వరకు ఇదే పదవిలో వుంటారు.
కానీ మరో దాని ప్రకారం నవంబర్ 30 వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించవచ్చు.