జ్ఞాపకశక్తి( memory ) తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.? చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని విషయాలు మర్చిపోతున్నారా.? అయితే ఇది మతిమరుపు వ్యాధికి ప్రమాదకర సంకేతం.కాబట్టి ఇక నుంచి జ్ఞాపకశక్తిని నిలుపుకొందాం, పెంచుకుందాం.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లడ్డూలను రోజుకు రెండు తింటే జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది.
అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం జ్ఞాపక శక్తిని పెంచే ఆ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం( almond ) వేసి మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు నువ్వులు కూడా వేసి విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న బాదం, కొబ్బరి తురుము, నువ్వులు, ఐదు యాలకులు( Grate coconut, sesame seeds, five cardamoms ) వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
చివరిగా ఒకటిన్నర కప్పు బెల్లం( jaggery ) తురుము వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఈ లడ్డూలు నిల్వ ఉంటాయి.
రోజుకు రెండు చొప్పున ఈ లడ్డూలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.మునుపటి కంటే షార్ప్ గా మీ బ్రెయిన్ పనిచేస్తుంది.
మతిమరుపు మొదలుకొని అల్జీమర్స్, డిమెన్షియా వరకు అనేక మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే ఈ లడ్డూలను రోజు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ లభిస్తుంది.
రక్తహీనత దూరం అవుతుంది.ఎముకలు దృఢంగా సైతం మారతాయి.
.