భూపాలపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ బైక్ నడుపుతూ కిందపడినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కొండా సురేఖకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే గమనించిన ఇతర నేతలు ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఆమె సొంతంగా బైక్ నడుపుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే కొండా సురేఖ పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, స్వల్ప గాయాలేనని వైద్యులు వెల్లడించారు.కాంగ్రెస్ విజయభేరీ యాత్రంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.