ఒక కుటుంబం పాలిట ఇద్దరు మహిళలు శత్రువులుగా మారి తమ పగను తీర్చుకోవడం కోసం ఏకంగా ఆ కుటుంబంలోని ఐదు మంది ప్రాణాలను బలి తీసుకున్నారు.వేధింపుల కారణంగా ఒక మహిళ.
ఆస్తి తగాదాల( Property Disputes ) కారణంగా మరో మహిళ ఆ కుటుంబం పై పగ పట్టి పథకం రచించి 20 రోజుల్లో ఏకంగా 5 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మహారాష్ట్రలోని( Maharashtra ) గడ్చిరోలిలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.గడ్చిరోలి లో నివాసం ఉండే ఓ కుటుంబం తమ కోడలైన సంఘమిత్రను( Sanghamitra ) తరచూ వేధింపులకు గురి చేసేవారు.సంఘమిత్రకు భర్త తీరుతో పాటు అత్తమామల తీరు కూడా నచ్చలేదు.ఈ కుటుంబానికి మరో మహిళకు ఆస్తి తగాదాలు ఉన్నాయి.
సంఘమిత్ర ఆస్తి తగాదాలు ఉన్న మహిళతో చేతులు కలిపి అత్తింటి కుటుంబంపై పగ తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది.వీరి పథకం ప్రకారం వాసన, రంగు, రుచి లేని ఓ నాటు మందును సెప్టెంబర్ 20న శంకర్ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో కలిపారు.
మందు కలిపిన ఆహారం తిన్న వారికి తీవ్ర ఒంటి నొప్పులతో పాటు గుండెనొప్పి వచ్చింది.ఆస్పత్రిలో చేర్పించగా సెప్టెంబర్ 26న శంకర్ కుంభారే,( Shankar Kumbhare ) 27న విజయ( Vijaya ) చనిపోవడం జరిగింది.
ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మరవక ముందే.మృతి చెందిన దంపతుల కుమార్తెలు కోమల్ దహగావ్ కర్, ఆనంద, కుమారుడు రోషన్ కుంభారే అస్వస్థతకు గురయ్యారు.కుటుంబ సభ్యులు వీరిని ఆసుపత్రిలో చేర్పించగా అక్టోబర్ 8న కోమల్, అక్టోబర్ 14న ఆనంద, అక్టోబర్ 15న రోషన్ మృతి చెందారు.తల్లిదండ్రుల ఆరోగ్యం విషమించిందని తెలియగానే శంకర్ కుంభారే పెద్ద కుమారుడు సాగర్ కుంభారే( Sagar Kumbhare ) ఢిల్లీ నుంచి చంద్రపూర్ వచ్చి అతను కూడా అనారోగ్యం బారిన పడ్డాడు.
వీరి కుటుంబ డ్రైవర్ రాకేష్ కూడా అనారోగ్యం పాలిట పడ్డాడు.
ఈ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ అనుమానాస్పద మరణాలే.విష ప్రభావం( Poison ) వల్లనే వీరు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.విద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బుధవారం సంఘమిత్ర, రోసా లను పోలీసులు అరెస్టు చేశారు.ఆ కుటుంబంలో చనిపోయిన రోషన్ యొక్క భార్యనే ఈ సంఘమిత్ర.అత్తింటి వేధింపులు భరించలేక రోసా అనే మహిళతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.