డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
అయితే తనతో సినిమాలు చేసిన హీరోలందరిపై తనదైన ముద్ర వేస్తాడు దర్శకుడు పూరి జగన్నాధ్.స్క్రీన్ పై వాళ్లను కొత్తగా చూపించడమే కాకుండా ఆఫ్-స్క్రీన్ కూడా సదరు హీరోల్లో చిన్న మార్పులు గమనించవచ్చు.
అలాంటి మార్పు బాలయ్యపై( BalaKrishna ) కాస్త గట్టిగానే పడినట్టుంది.బాలయ్యతో సినిమా చేసిన పూరి జగన్నాధ్,( Purijagannath ) ఆ సినిమాలో అతడి ఒక బూతు మేనరిజమ్ చేయించాడు.
అది సినిమా వరకు మాత్రమే పరిమితమైతే బాగుండేది.కానీ ఆ సినిమా ప్రచారంలో కూడా దాన్ని ఒక బ్రాండింగ్ లా వాడారు.సినిమా పోయింది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు కానీ బాలయ్య మాత్రం ఆ చేతి ఊపుడు ఆపలేదు.ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, సమయం సందర్భం లేకుండా ఇబ్బందికరంగా అనిపించే ఆ హస్త లాఘవాన్ని చూపించడం హాబీగా మార్చుకున్నారు.
అయితే ఇప్పటికే పలుమార్లు బాలయ్య చేతివాటాన్ని చూసిన జనం, తాజాగా మరోసారి అలాంటి బిహేవియర్ చూసి ముక్కున వేలేసుకున్నారు.భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన బాలయ్య, ఎంతో భవిష్యత్ ఉన్న తన కొడుకు మోక్షజ్ఞను( Mokshagna ) బద్నామ్ చేయడమే కాకుండా, ఆ సందర్భంగా తన చేతితో చూపించిన సంజ్ఞ వివాదాస్పదమైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చించుకుంటున్నారు జనం.బాలకృష్ణ కేవలం నటుడు మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పొలిటీషియన్ ( Politician ) కూడా.ఆదర్శంగా ఉండాల్సిన ఈ వ్యక్తి, ఎప్పుడుపడితే అప్పుడు తన లేకితనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు.అది చేతి సంజ్ఞ కావొచ్చు, ఫోన్ సంభాషణ కావొచ్చు, నోటి దురద కావొచ్చు, అసిస్టెంట్లు, అభిమానులపై చేయిచేసుకోవడం కావొచ్చు.
ఇలా సందర్భం ఏదైనా తన హుందాతనాన్ని తానే దిగజార్చుకుంటున్నారు బాలయ్య బాబు.