టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.చంద్రబాబు అరెస్ట్ గురించి సీఎం జగన్ తెలియదనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
అయితే సీఎం జగన్ మాటలను రాష్ట్రంలో ప్రజలెవరూ నమ్మరని గంటా శ్రీనివాసరావు తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ పై గుజరాత్ లో స్టడీ చేసి ఏపీలో అమలు చేశామన్నారు.2020లో స్కిల్ డెవలప్ మెంట్ నంబర్ వన్ అని జగన్ అన్నారని గంటా గుర్తు చేశారు.అదేవిధంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశారు.