మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మల్కాజ్ గిరి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ( Mainampalli hanumanthrao )ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.బీఆర్ఎస్ లో ఆయనకు సముచిత స్థానమే లభించినప్పటికీ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును ప్రకటించినప్పటికీ, తన కుమారుడు కి మెదక్ అసెంబ్లీ స్థానం ఇవ్వకపోవడంపై అలక చెంది కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందుగానే మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని సంచల విమర్శలు చేసిన మైనంపల్లి మరోసారి కెసిఆర్, కేటీఆర్, కవిత ,హరీష్ రావును టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు.గజ్వేల్ కొస్తా, సిద్దిపేట కొస్తా, సిరిసిల్ల కొస్తా, నిజామాబాద్ కూ వస్తా , ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మీ అవినీతి వాటా ఎంతో సాక్షాలతో నిరూపిస్తా.
బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం , రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం అంటూ మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్, ( CM kcr ) మంత్రులు హరీష్ రావు,( Harish Rao ) కేటీఆర్ , కవితలను ఉద్దేశించి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడిన మైనంపల్లి … దళిత బంధు, బీసీ బందు, మైనారిటీ బందు సహా, అన్ని ప్రభుత్వ పథకాలలోను ఎవరెవరు ఎంతెంత వాటా తీసుకున్నారో తన వద్ద లిస్టు ఉందని, అన్నిటిని బయటపడతానని మైనంపల్లి సవాల్ చేశారు.మొన్నటివరకు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మైనంపల్లి కె మల్కాజ్ గిరి టికెట్ మళ్లీ ప్రకటించినా, తన కుమారుడు రోహిత్( Rohit ) కు మెదక్ అసెంబ్లీ స్థానం ఇవ్వకపోవడం పైనే మైనంపల్లి అలక చెందారు.
మెదక్ అసెంబ్లీ స్థానాన్ని పద్మ దేవేందర్ రెడ్డి( Padma Devender Reddy ) కి కేటాయించడం వెనుక హరీష్ రావు హస్తం ఉందని మైనంపల్లి అనుమానిస్తున్నారు.అయితే మైనంపల్లి ని బుజ్జగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం మెదక్ అసెంబ్లీ స్థానం విషయంలో పట్టు వీడకపోవడం తో బీఆర్ ఎస్ సైలెంట్ అయ్యింది.దీంతో రెండు టికెట్ల హామీతో కాంగ్రెస్ లో ఆయన చేరారు.