బిగ్ బాస్ ఆదివారం 2.0 మినీ లాంచ్( Bigg Boss 2.0 Launch ) ఈవెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు.
వీరిలో భాగంగా గుండమ్మ కథ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి పూజా మూర్తి ( Pooja Murthy )కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె ఈ కార్యక్రమం మొదట్లోనే హౌస్ లోకి వెళ్లాల్సి ఉండగా బిగ్ బాస్ ప్రారంభమవుతుంది అన్న కొద్ది రోజులకు ముందు తన తండ్రి చనిపోవడంతో ఈమె ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభంలో పాల్గొనాల్సిన పూజ మూర్తి వైల్డ్ కార్డు ఎంట్రీ( Pooja Murthy Bigg Boss ) ద్వారా హౌస్ లోకి వచ్చారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లినటువంటి పూజ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి పలు విషయాలను వెల్లడించారు.తాను కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి.తాను నటనపై ఆసక్తితో కెరియర్ మొదట్లో ఎన్నో ఆఫీసులకు వెళుతూ ఆడిషన్స్ ఇచ్చాను ఇలా ఆడిషన్స్ ఇచ్చే సమయంలోనే చాలామంది నేను లావుగా ఉన్నాను అంటూ నన్ను రిజెక్ట్ చేసేవారని తెలియజేశారు.
ఇలా ఆడిషన్స్ కి వెళ్ళిన ప్రతిసారి బాడీ షేమింగ్ కామెంట్స్( Body Shaming Comments ) రావడంతో గదిలో కూర్చుని ఒంటరిగా ఎంతో ఏడ్చేదాన్ని అంటూ ఈమె తెలియజేశారు.అయితే టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు తొక్కేయలేరు అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా నేను నా ప్రయత్నాలు చేశానని ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోని తెలుగులో సీరియల్స్ చేసే అవకాశం అందుకున్నాను అంటూ పూజ మూర్తి వెల్లడించారు.ఇలా గుండమ్మ కథ ( Gundamma katha ) సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి పూజ మూర్తి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
మరి ఈమె తన ఆట తీరుతో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.