ఈరోజుల్లో, బస్ స్టాప్ అనే చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టి తన టాలెంట్ తో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో మారుతి( Director maruthi ) ఒకరు.భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు సైతం హిట్లు ఇచ్చిన మారుతికి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కలేదు.
కరోనా సమయంలో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ ఆయన స్థాయి సినిమాలు కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ప్రభాస్ మారుతి కాంబో మూవీ మొదలై చాలా నెలలైనా ఈ సినిమాకు సంబంధించి సరైన అప్ డేట్ లేదు.మారుతి తన పుట్టినరోజు సందర్భంగా పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలలో ప్రభాస్( Prabhas ) సినిమా కోసం కసితో పని చేస్తున్నట్టు చెప్పారు.విమర్శలు, నెగిటివ్ కామెంట్లు నాకు గురువులుగా మారాయని మారుతి తెలిపారు.
నన్ను నేను మార్చుకోవడానికి విమర్శలు ఉపయోగపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.
కెరీర్ తొలినాళ్లలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ప్రేమకథాచిత్రమ్ తీశానని అయినప్పటికీ కొందరు విమర్శలు చేస్తుంటే కసితో భలే భలే మగాడివోయ్( Bhale Bhale Magadivoy ) తీశానని మారుతి తెలిపారు.నన్ను విమర్శించే కొద్దీ నేను స్ట్రాంగ్ అవుతానని ఆయన పేర్కొన్నారు.నాకు చేతకాదని చేయలేనని ఎవరైనా చెబితే నాకు చాలా కోపం వస్తుందని మారుతి వెల్లడించారు.
నేను తీయలేనని ఎవరైనా కామెంట్ చేస్తే కచ్చితంగా హిట్ కొడతానని ఆయన అన్నారు.నేను కసితో చేసిన సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఆయన తెలిపారు.ప్రభాస్ తో మూవీ ప్రకటించిన సమయంలో ట్రోల్స్ రావడంతో పాటు నాకు చాలా కోపం ఇచ్చారని మారుతి అన్నారు.ప్రభాస్ కూడా డార్లింగ్ నీకు కోపం రావాలని అన్నాడని మారుతి పేర్కొన్నారు.
నేను చేయలేనని కొందరు సవాల్ విసిరారని ప్రభాస్ సినిమాతో కొట్టి చూపిస్తానని ఆయన కామెంట్లు చేశారు.