ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అధికార పార్టీ వైసీపీలోనూ( YCP ) కాస్త టెన్షన్ కలిగిస్తున్నాయి.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్( Skill development scam ) లో అరెస్టు చేయడంతో, దానిని సానుభూతిగా మార్చుకుని, వచ్చే ఎన్నికల్లో గెలవాలనే, వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఉంది.
వైసిపి ప్రభుత్వం తనప్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని , 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సాక్షదారులు లేకుండా తప్పుడు కేసులతో అరెస్టు చేయించారని ఇప్పటికే టిడిపి ప్రజల్లోకి వెళ్ళింది.రాష్ట్రం , దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ హైలెట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే ఈ వ్యవహారం తో అధికార పార్టీ వైసిపి పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉండడాన్ని గుర్తించిన జగన్ టిడిపి దూకుడికి కొడుకు బ్రేక్ వేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు జగన్( jagan ) తన ఎన్నికల వ్యూహాల్లో మార్పు చేర్పులు చేసుకుంటున్నారు.మరోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని, చంద్రబాబు అరెస్టు కు దారి తీసిన పరిస్థితులు అప్పటి టిడిపి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ప్రజల మధ్యనే ప్రస్తావించి టిడిపి పై సానుకూలత లేకుండా చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.చంద్రబాబు( Chandrababu ) అవినీతి చేసి అరెస్ట్ అయ్యారు అని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ప్రజాశీర్వాద యాత్ర పేరుతో ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, తాను ప్రజలని నమ్ముకున్నానని, ఎప్పటికే అనేక సందర్భాల్లో జగన్ ప్రకటించారు.
తనకు ప్రజలతోనే పొత్తు ఉంటుందని, ఏ పార్టీతోను తాను పొత్తు పెట్టుకోను అని జగన్ ఇప్పటికే ప్రకటించడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175ను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు.ఇప్పటికే అనేక సర్వే చేయించిన జగన్, తాను ప్రజల్లోకి వెళ్లడం ద్వారా వైసిపి గ్రాఫ్ మరింతగా పెరుగుతుందనే విషయాన్ని గుర్తించారు ఒకవైపు ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండడం, మరోవైపు టిడిపి చంద్రబాబు అరెస్టును సెంటిమెంట్ గా మార్చుకుని తమకు అనుకూలంగా మార్చుకునే ఆలోచనతో ఉండడంతో… జగన్ నేరుగానే రంగంలోకి దిగి ప్రజా మద్దతు కూడగట్టబోతున్నారట.