రజనీకాంత్( Rajinikanth ) హీరోగా నటించిన చంద్రముఖి ( Chandramukhi ) సినిమా సీక్వెల్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాలో రజనీకాంత్ స్థానంలో ప్రముఖ నటుడు లారెన్స్ ( Lawrence ) నటించగా జ్యోతిక స్థానంలో బాలీవుడ్ నటి కంగనా రౌనత్( Kangana Ranaut ) నటించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు లారెన్స్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్నారు అని తెలియగానే తాను భయపడ్డానని తెలిపారు.
ముఖ్యంగా ఆమె కోసం వచ్చినటువంటి సెక్యూరిటీని చూడగానే తనకు భయం వేసిందని ఇదే విషయం కంగనాతో చెప్పగా ఆమె తన సెక్యూరిటీని బయటకు పంపించిందని అప్పటినుంచి తనతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయాము అంటూ తెలియచేశారు.రజినీకాంత్ ( Rajinikanth )గారి పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నాను అంటే అది కేవలం రాఘవేంద్ర స్వామి వరంగా భావిస్తున్నానని ఈయన తెలిపారు.సూపర్ స్టార్ రజినీకాంత్ గారు చేసినటువంటి ఈ పాత్రను నేను అంత గొప్పగా చేయగలనా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలు అని అనుకున్నాను.
ఇలా రజనీకాంత్ గారు నటించిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తాను ఈ సినిమాలో భయపడుతూనే నటించానని లారెన్స్ ( Raghava Lawrence )వెల్లడించారు.కచ్చితంగా ఈ సినిమా మీ అందరిని తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ లారెన్స్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాకు చంద్రముఖి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించారు.దాదాపు 15 సంవత్సరాల తర్వాత చంద్రముఖి సినిమా సీక్వెల్ రాబోతున్న తరుణంలో ఈ సినిమాపై అంచనాలు కూడా ఉన్నాయి.
మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.