బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజ్ అండ్ డీకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ మెన్( The family Man ) వెబ్ సిరీస్ ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లను పూర్తి చేసుకుని త్వరలోనే మూడవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఇప్పటివరకు ఈ మూడవ సీజన్ గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో అభిమానులు కూడా ఈ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్( Monoj Bajpaay ) ప్రియమణి ( Priyamani ) నటించిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషలలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సిరీస్ రెండవ సీజన్లో సమంత( Samantha ) కూడా రాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి సీజన్ 3 గురించి క్రేజీ అప్డేట్ విడుదల చేశారు.తాజాగా ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్( Jawan ) సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియమణికి ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సీజన్ 3 గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నిన్ననే నాకు రాజ్ అండ్ డీకే సార్ ఫోన్ చేశారు.త్వరలోనే ఈ సిరీస్ మీ ముందుకి రాబోతుంది.కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సిరీస్ కోసం వెయిట్ చేయండి అంటూ ప్రియమణి నవ్వుతూ సమాధానం చెప్పారు.ఇలా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
.