మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ కొనసాగుతోంది.ఈ మేరకు గత నాలుగు గంటలకు పైగా నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 Investigation Of Hero Navdeep In Madapur Drug Case-TeluguStop.com

విచారణలో భాగంగా తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని హీరో నవదీప్ చెప్తున్నారని తెలుస్తోంది.కేసులో డ్రగ్స్ సప్లయర్ గా ఉన్న రామచంద్రతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు నవదీప్ ఒప్పుకున్నారు.

అయితే ఆ నగదు లావాదేవీలు డ్రగ్స్ కు సంబంధించినవి కాదని చెబుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు ఆధారాలు చూపించారు.

పోలీసుల విచారణలో కొన్ని ప్రశ్నలకు నవదీప్ సమాధానం దాటవేస్తున్నారని తెలుస్తోంది.అయితే మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో నవదీప్ ను కూడా నిందితుడిగా నార్కోటిక్స్ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube