తండ్రి వడ్రంగి.. కొడుకు యూపీఎస్సీ పరీక్షలో టాపర్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించే వాళ్లకు ఎదురయ్యే అవరోధాలు అన్నీఇన్నీ కావు.బీహార్ ( Bihar )రాష్ట్రానికి చెందిన జై ప్రకాష్ సాహ( Jai Prakash Saha ) చిన్నప్పుడే లక్ష్యాన్ని సాధించే వరకు సొంతూళ్లో అడుగు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు.

 Jai Prakash Sah Upsc Iss Exam Ranker Success Story Telugu Details Here Goes Vir-TeluguStop.com

బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా మఘౌలియ బ్లాక్ లోని జోకాటియా పంచాయితీకి చెందిన జైప్రకాష్ తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారు.

జై ప్రకాష్ తండ్రి ఒకప్పుడు వడ్రంగి( Carpenter ) కాగా ప్రస్తుతం నైనిటాల్ లో కూలీగా పని చేస్తున్నారు.

జై ప్రకాష్ తల్లి గాయత్రీ దేవి కుటుంబ పోషణ కొరకు మేకలను మేపుతారు.జైప్రకాష్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు.స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జైప్రకాష్ 2012 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.డిగ్రీ పూర్తైన తర్వాత జైప్రకాష్ ఒక కంపెనీకి ఫ్రీలాన్సింగ్ చేశారు.

Telugu Bihar, Carpenter, Champaran, Jai Prakash Sah, Story, Upsc, Upsc Exam-Gene

జైప్రకాష్ ఎంతో కష్టపడి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.ఐ.ఎస్.ఎస్.పరీక్షలో మన దేశం నుంచి 29 మంది ఎంపిక కాగా ఆ 29 మందిలో జై ప్రకాష్ ఒకరు కావడం గమనార్హం.జై ప్రకాష్ మూడుసార్లు ఈ పరీక్ష రాయగా మూడో ప్రయత్నంలో జై ప్రకాష్ సక్సెస్ సాధించారు.

జై ప్రకాష్ ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Bihar, Carpenter, Champaran, Jai Prakash Sah, Story, Upsc, Upsc Exam-Gene

జై ప్రకాష్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.తన లక్ష్యాన్ని సాధించిన తర్వాతే జై ప్రకాష్ సొంతూరికి అడుగుపెట్టారు.జై ప్రకాష్ కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించడం సులువేనని జై ప్రకాష్ పేర్కొన్నారు.జై ప్రకాష్ సాహ తన సక్సెస్ తో ఎంతోమంది నెటిజన్లను తనకు అభిమానులుగా మార్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube