తండ్రి వడ్రంగి.. కొడుకు యూపీఎస్సీ పరీక్షలో టాపర్.. ఈ వ్యక్తి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించే వాళ్లకు ఎదురయ్యే అవరోధాలు అన్నీఇన్నీ కావు.బీహార్ ( Bihar )రాష్ట్రానికి చెందిన జై ప్రకాష్ సాహ( Jai Prakash Saha ) చిన్నప్పుడే లక్ష్యాన్ని సాధించే వరకు సొంతూళ్లో అడుగు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు.

బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా మఘౌలియ బ్లాక్ లోని జోకాటియా పంచాయితీకి చెందిన జైప్రకాష్ తన లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారు.

జై ప్రకాష్ తండ్రి ఒకప్పుడు వడ్రంగి( Carpenter ) కాగా ప్రస్తుతం నైనిటాల్ లో కూలీగా పని చేస్తున్నారు.

జై ప్రకాష్ తల్లి గాయత్రీ దేవి కుటుంబ పోషణ కొరకు మేకలను మేపుతారు.

జైప్రకాష్ కు ఇద్దరు సోదరులు ఉన్నారు.స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జైప్రకాష్ 2012 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

డిగ్రీ పూర్తైన తర్వాత జైప్రకాష్ ఒక కంపెనీకి ఫ్రీలాన్సింగ్ చేశారు. """/" / జైప్రకాష్ ఎంతో కష్టపడి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

ఐ.ఎస్.

ఎస్.పరీక్షలో మన దేశం నుంచి 29 మంది ఎంపిక కాగా ఆ 29 మందిలో జై ప్రకాష్ ఒకరు కావడం గమనార్హం.

జై ప్రకాష్ మూడుసార్లు ఈ పరీక్ష రాయగా మూడో ప్రయత్నంలో జై ప్రకాష్ సక్సెస్ సాధించారు.

జై ప్రకాష్ ఎంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

"""/" / జై ప్రకాష్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

తన లక్ష్యాన్ని సాధించిన తర్వాతే జై ప్రకాష్ సొంతూరికి అడుగుపెట్టారు.జై ప్రకాష్ కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించడం సులువేనని జై ప్రకాష్ పేర్కొన్నారు.జై ప్రకాష్ సాహ తన సక్సెస్ తో ఎంతోమంది నెటిజన్లను తనకు అభిమానులుగా మార్చుకున్నారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు ఏం క్యారెక్టర్లు పోషించారో తెలిస్తే..?