అంతా జగన్ మంచికే.. ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి.; టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) కావడం, టీడీపీ జనసేన పొత్తు పొట్టుకోవడం వంటి పరిణామాలతో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకొనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

 Everything Is Good For Jagan, Chandrababu Arrest , Janasena , Ys Jagan Mohan Red-TeluguStop.com

అయితే ప్రస్తుత పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో జగన్ కే అనుకూలంగా మారనున్నాయా ? అనే కొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.ఇంతకీ విషయమేమిటంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు కూడా విజయం పై గట్టిగానే దృష్టి పెట్టాయి.

ఈసారి ఎలాగైనా జగన్ ను గద్దె దించి అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుంటే.ఈసారి కూడా ఆధీకరమ్ చేపట్టాలని వైసీపీ పట్టుదలగా ఉంది.అటు జనసేన కూడా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని గట్టి పట్టుదలతో ఉంది.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Ys Jagan, Ysjagan-Politi

ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తి నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు.దీంతో ఒక్కసారిగా టీడీపీ దూకుడుకి స్పీడ్ బ్రేక్ పడినట్లైంది.దీంతో ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన చంద్రబాబుపై పడిన అవినీతి మచ్చ వచ్చే ఎన్నికల్లో టీడీపీపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

అటు జనసేన( Jana sena ) అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించింది.దాంతో పవన్ తన స్వలాభం కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమౌతోంది.

ఎందుకంటే ఒంటరిగా పోటీచేసే సత్తా ఉన్నప్పటికి పవన్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు చాలమంది వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Ys Jagan, Ysjagan-Politi

దీంతో ఒక్క జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )ని ఓడించేందుకు అన్నీ పార్టీలు ఏకమౌతున్నాయనే సానుభూతి జగన్ పై ఏర్పడే అవకాశం ఉంది.ఆయన కూడా ప్రతి బహిరంగ సభలోనూ ఇదే చెబుతున్నారు.మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు మొత్తం ఏకమౌతుందని, మీ బిడ్డకు మీరే తోడు అంటూ ప్రజల్లో సెంటిమెంట్ ను పుట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

దాంతో సాధారణంగానే ప్రజల్లో ఇటువైపు ఒక్కడు అటువైపు వందలు అనే భావన ఏర్పడుతుంది.దాంతో సానుభూతి పరంగా ఒంటరిగా ఉన్నవారి పైనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.అందుకే పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించడం వైసీపీకే మేలనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం.అందుకే ప్రస్తుతం జరుగుతున్నా పరినమలన్నీ జగన్ మంచికే అని భావిస్తున్నారు.

మరి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube