ఈ హోమ్ మేడ్ విటమిన్ సి క్రీమ్ ను వాడితే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు!

మొటిమలతో బాగా సతమతం అవుతున్నారా.? ఎన్ని విధాలుగా ప్రయత్నించిన మొటిమలను ( Pimples )వదిలించుకోలేకపోతున్నారా.? ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉందా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ విటమిన్ సి క్రీమ్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ క్రీమ్ ను రోజుకు ఒకసారి రాసుకుంటే మొటిమల సమస్యకు బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Homemade Vitamin C Cream For Avoiding Acne , Acne, Vitamin C Cream, Homemade Vi-TeluguStop.com
Telugu Acne, Tips, Clear Skin, Face Cream, Homemadevitamin, Latest, Pimples, Ski

ముందుగా ఒక ఆరెంజ్ మరియు ఒక నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరెంజ్ మరియు నిమ్మ పండు ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ మరియు ఆరెంజ్( Orange ) లెమన్ జ్యూస్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆపై స్టవ్ పై పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించాలి.

Telugu Acne, Tips, Clear Skin, Face Cream, Homemadevitamin, Latest, Pimples, Ski

క్రీమ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి.చివరిగా ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని స్పూన్‌ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటే మన విటమిన్ సి క్రీమ్ సిద్ధం అయినట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలిరోజు నైట్ నిద్రించే ముందు ఈ విటమిన్ సి క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు దెబ్బకు పరారవుతాయి.అవి మళ్లీ మళ్లీ వేధించకుండా సైతం ఉంటాయి.నిత్యం ఈ క్రీమ్ ను వాడితే ఇక‌పై మొటిమలు >( Pimples )మీ దరిదాపుల్లోకి కూడా రావు.

కాబట్టి మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ విటమిన్ సి క్రీమ్ ను తయారు చేసుకునే వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube