మంత్రి కృతజ్ఞత సభ నిరుద్యోగులపై కక్ష్య సాధింపు చర్యనే

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం మెడికల్ కాలేజ్ ప్రారంభము సంధర్భంగా తల పెట్టిన కృతజ్ఞత సభ ముమ్మాటికి నిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలో ఒక భాగమే అని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్, లంబాడా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు,నిధులు,నియామకాలు ,నిరుద్యోగ యువకులంతా కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసి,తెచ్చుకున్న రాష్ట్రలో గద్దెనెక్కిన ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల పేరు మీద నిధులు దోచుకుంటూ కనీసం నియమకాయల ఉసే ఎత్తని పరిస్థితిలో ఉందనీ,కొట్లాడితే గాని ఉద్యోగం నోటిఫికేషన్ ఇయ్యని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని దుయ్యబట్టారు.

 Ministers Appreciation House Is A Circular Action Against The Unemployed, Rajann-TeluguStop.com

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు 20వేల పైచిలుకు కాళీ ఉన్నాయని వాటికి వెంటనే మెగా డీఎస్సీ వెయ్యాలని మూడు లక్షల పైగా డీఎస్సీ అభ్యర్థులు ఉద్యమాలు చేస్తే కొండను తవ్వి ఎలకన్ పట్టినట్టుగా 20వేలపై చిలుకు ఖాళీల మెగా డీఎస్సీ అడిగితే 5000 ఖాళీలలతో నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చినటువంటి ఖాళీలా భర్తీ కోసం అర్హత పరీక్షా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాస్తున రోజే మెడికల్ కాలేజ్ ప్రారంభము పేరు మీద కృతజ్ఞత సభ పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు.మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ లో ఉండగా అక్కడే ప్రారంభించినంక సభా నిర్వహణకు విశాలమైన ప్రాంతం ఉన్న నిర్వహించకుండా సిటీ నడి మధ్యలో నిర్వహించడం నిరుద్యోగులపై ఉన్న ప్రేమకు అర్థం పడుతుందని అన్నారు.

ఈ సభ నిర్వహణ వల్ల అధికార యంత్రాంగం గందరగోలానికి గురై ఒక సెంటర్లో ఈయాల్సిన పేపర్లు మరో సెంటర్లో ఇవ్వడం వల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని, వీటివల్ల అభ్యర్థులు ఆందోళనలకు గురి అవుతున్నారని వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వెంటనే వైట్నర్ పెట్టినటువంటి ఓఎంఆర్ షీట్లను పరిగణలకు తీసుకొని వారిని క్వాలిఫైడ్ చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో నిరుద్యోగుల తాపానికి గురికావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ పక్షాన నిలబడి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎలాంటి అవకతవకలు లేకుండా సజావుగా జరిగేటట్టు అధికార యంత్రాంగం చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.లేని పక్షంలో రాష్ట్రంలో నిరుద్యోగులు అందరు ఏకం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పర్శరం,తిరుపతి తదితరులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube