ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.వెనుకబడిన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళలకు చట్టసభల్లో 33 శాతం స్థానం కల్పించాలంటున్నారన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలో మహిళల భాగస్వామ్యం గురించి కవిత చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బీసీలకు 22 టికెట్లు మాత్రమే ఇచ్చి 33 శాతం రిజర్వేషన్ పై మాట్లాడుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలో కేసీఆర్ మాటలు నమ్మి బీసీలు మోసపోవద్దని ఆయన సూచించారు.