సొరకాయ సాగులో( Bottle Gourd Cultivation ) అధిక దిగుబడి సాధించాలంటే సేంద్రీయ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.సొరకాయ సాగుకు నీరు ఇంకిపోయే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకొని నేలను వదులుగా అయ్యేలాగా దమ్ము చేసుకోవాలి.ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువు( Cattle manure ) వేసి కలియ దున్నుకోవాలి.
సొరకాయ సాగును మూడు పద్ధతుల ద్వారా సాగు చేయవచ్చు.పై పందిరి పద్ధతి, అడ్డు పందిరి పద్ధతి, బోదెల ద్వారా నేలమీద పండించే పద్ధతి.
మొక్కల మధ్య మూడు అడుగుల దూరం, మొక్కల వరుసల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
ఒక ఎకరం పొలంలో 80 గ్రాముల విత్తనాలు విత్తుకోవాలి.విత్తుక్కోవడానికి ముందు విత్తన శుద్ధి చేసుకుంటే వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించకుండా ఉంటాయి.ఈ పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ.
పంట పూత దశలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీరు అందించడం వల్ల సొరకాయ ఆరోగ్యవంతంగా అధిక నాణ్యతతో పెరుగుతుంది.డ్రిప్ ఇరిగేషన్( Drip irrigation ) ద్వారా పంటకు నీరు అందిస్తే నీరు వృధా అవదు.
పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పంట విత్తిన 50 రోజుల తర్వాత దిగుబడి రావడం మొదలవుతుంది.
కాయ బరువు ఒక కిలో ఉన్నప్పుడు పంట కోత చేయాలి.పంట కోతను సరైన సమయంలో చేపట్టకపోతే వేరే ఎదుగుతున్న కాయలపై ప్రభావం పడి వాటి ఎదుగుదల నెమ్మదిస్తుంది.
సొరకాయలో పై పందిరి పద్ధతి పాటించి సాగు చేయడం వల్ల అధిక దిగుబడి సాధించడం వీలు అవుతుంది.నేల మీద పండించడం వల్ల కాయలు వంకరలు తిరిగి ఉండడం జరుగుతుంది.
వంకరగా తిరిగిన కాయలకు మార్కెట్లో రేటు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.