టాలీవుడ్( Telugu Film Industry ) లో ప్రస్తుతం పూర్తిగా మార్కెట్ కొల్పిన కుటుంబం ఏదైనా ఉందా అంటే అది మంచు కుటుంబం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈ కుటుంబం నుండి వస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఏమాత్రం కూడా ఆసక్తి కనిపించడం లేదు.
అంతకు ముందు అయినా కాస్తో కూస్తో ఓపెనింగ్స్ అయినా వచ్చేవి, కానీ ఇప్పుడు అది కూడా లేదు.మొదటి రోజు మొదటి ఆట నుండే గ్రాస్ లు రావడం లేదు.
ఇది నిజంగా చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. మోహన్ బాబు( Mohan Babu ) ఒకప్పుడు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరో, అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ లేటెస్ట్ యూత్ కి తగ్గట్టు సినిమాలు చెయ్యకపోవడం, ఆయన ఇద్దరు కొడుకులు కూడా అదే తరహాలో ఉండడం వల్ల ఈ కుటుంబానికి ఇలాంటి దుస్థితి వచ్చిందని అందరూ అంటున్నారు.అయితే ఓటమి ని ఒప్పుకోవడం ఈ కుటుంబం లో ఎవరికీ ఇష్టం ఉండదు.
![Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Pawan Kalyan, Prabhas, Tollywood-Mov Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Pawan Kalyan, Prabhas, Tollywood-Mov](https://telugustop.com/wp-content/uploads/2023/09/prabhas-manchu-vishnu-kannappa-key-rolea.jpg)
మళ్ళీ భారీ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు.అందుకోసం మంచు విష్ణు( Manchu Vishnu ) హీరో గా తన డ్రీం ప్రాజెక్ట్ గా పిలవబడుతున్న ‘కన్నప్ప'( Kannappa ) అనే చిత్రాన్ని రీసెంట్ గానే గ్రాండ్ గా ప్రారంభించారు.ఈ సినిమాకి సుమారుగా వంద కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.ఇందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడని చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక టాక్ నడుస్తుంది.
ఈ విషయం పై మంచు విష్ణు స్పందిస్తూ, ప్రభాస్ ఈ చిత్రం లో నటిస్తున్నట్టుగా ఖరారు చేసాడు.ఇందులో ప్రభాస్ మహా శివుడి పాత్ర( Prabhas Lord Shiva ) పోషించబోతున్నాడు అట.ఈ పాత్ర నిడివి 10 నిమిషాల వరకు ఉంటుందని టాక్.ఇందులో ప్రభాస్ తో పాటుగా ఇండియా లో ఉన్న 20 మంది టాప్ స్టార్స్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తారని తెలుస్తుంది, వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఉంటాడట.
![Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Pawan Kalyan, Prabhas, Tollywood-Mov Telugu Kannappa, Manchu Vishnu, Mohan Babu, Pawan Kalyan, Prabhas, Tollywood-Mov](https://telugustop.com/wp-content/uploads/2023/09/Pawan-Kalyan-Cameo-in-Manchu-Vishnu-Kannappa-Movie.jpg)
అలాగే టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) ని కూడా ఒక్క చిన్న గెస్ట్ రోల్ కోసం మోహన్ బాబు సంప్రదించినట్టుగా తెలుస్తుంది.మోహన్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉంది.వీళ్లిద్దరు కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు.ఆ చనువుతోనే మోహన్ బాబు అడిగాడట.పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.చూస్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ సరైన పద్దతి లో తీస్తే సెన్సేషన్ అవ్వుధి అని అంటున్నారు.
ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్( Mukesh Kumar Singh ) దర్శకత్వం వహిస్తున్నాడు.ఈయన బుల్లితెర పై సంచలన విజయం సాధించిన ‘మహాభారతం'( Mahabharatham ) సీరియల్ కి దర్శకత్వం వహించాడు.
ఈ సీరియల్ ని ఆయన ఎంత ఎమోషనల్ గా తీసాడో మన అందరికీ తెలిసిందే, అంత మంచి దర్శకుడు ఈ చిత్రానికి పని చెయ్యబోతుండడంతో మూవీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.