స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas )గత మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలు భారీ అంచనాలతో విడుదల కాగా ఆ అంచనాలను అందుకోలేదు.
సలార్ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని ఈ మధ్య కాలంలో స్టార్ హీరో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ లేదనే లోటును తీరుస్తుందని చాలామంది ఫ్యాన్స్ భావించారు.అయితే సలార్ మేకర్స్ మాత్రం ఈ సినిమాపై అంచనాలను తగ్గిస్తున్నారు.
![Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollywood Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollywood](https://telugustop.com/wp-content/uploads/2023/08/prabhas-Salaar-Shruti-Haasan-Jagapathi-Babu-Prashanth-Neel-tollywood-social-media-Meenakshii-Chaudhary.jpg)
సలార్ సినిమా( Salaar ) రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఈ సినిమాకు ప్రమోషన్స్ ఆశించిన విధంగా జరగడం లేదు.ఇప్పటికైనా మారవయ్యా స్టార్ హీరో ప్రభాస్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ఫోకస్ పెడితే మాత్రమే సలార్ ప్రమోషన్స్ లో వేగం పుంజుకునే అవకాశం ఉంది.ఈ సినిమాలో సాంగ్స్ కూడా లేవని తెలుస్తోంది.
కనీసం ట్రైలర్ ఎప్పుడు రిలీజవుతుందో అప్ డేట్స్ ఇస్తే ప్రభాస్ అభిమానులు సంతోషంగా ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభాస్ ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభాస్ సినిమాల కలెక్షన్లపై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది.సలార్1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రమే సలార్2 సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
![Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollywood Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Prashanth Neel, Shruti Haasan, Tollywood](https://telugustop.com/wp-content/uploads/2023/08/prabhas-Salaar-Shruti-Haasan-Prashanth-Neel-tollywood-social-media-Meenakshii-Chaudhary.jpg)
సలార్2 షూటింగ్ ఎంతవరకు పూర్తైందనే క్లారిటీ లేదు.ఈ మధ్య కాలంలో సలార్ గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుండగా ప్రమోషన్స్ ద్వారా ఆ నెగిటివిటీకి చెక్ పెట్టాల్సి ఉంది.దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) అయినా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సలార్ మూవీ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.