కెరియర్ మొదట్లో షో లాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న కథ తో సినిమా తీసి నేషనల్ అవార్డ్( National Award ) అందుకున్న నీలకంఠ ( Nilakanta )ఆ తరవాత చేసిన మిస్సమ్మ సినిమాతో మంచి విజయం అందుకున్నారు.ఇక దాంతో ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు వరుస గా ప్లాప్ అయ్యాయి.
దాంతో ఆయన అప్పట్లో బాలీవుడ్ లో కూడా ఒక మూవీ చేశాడు అది కూడా అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో ఆయన ప్రస్తుత సినిమాలు లేక ఖాళీ గా ఉన్నారు నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది.ఎందుకంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు కూడా జనాలని చాలా బాగా అలరిస్తాయి.
అయితే ఈయన అప్పట్లో చేసిన సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈయన చేస్తున్న చాలా సినిమాలు కూడా మధ్యలోనే అగిపోతున్నాయి.మొన్న ఆ మధ్య ఒక కొత్త హీరో తో ఒక సినిమా స్టార్ట్ చేసి కొద్దిరోజులు షూట్ అయ్యాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని మధ్య లో ఆపేసారట…ఇక నిజానికి ఈయన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయిన కూడా ఆయనకి తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి…ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి కానీ తెలుగు లో మాత్రం ఆయన్ని స్టార్ హీరోలు( Star heroes ) పట్టించుకోలేదు.
ఇక ఈ విషయాలు అన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఒక కొత్త హీరో తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఆ హీరో ఎవరు, ఏ బ్యానర్ లో చేస్తున్నాడు అనే విషయాలు ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది…నీలకంఠ అంటే ఒకప్పుడు మంచి సినిమాలు తీశారు అనే టాక్ అయితే ఉంది…మధ్యలో ఆయన సినిమాలు ఆయన స్థాయి అంచనాలు అందుకోలేక పోయాయనే చెప్పాలి.