టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత( Samantha ) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా వరుస సినిమాలలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ప్రకటించారు.ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది.
ఇకపోతే తాజాగా ఈమె విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సరసన ఖుషి సినిమాలో( Khushi Movie ) నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్లకు సమంత దూరంగా అమెరికాలో ఉంటున్నారు.అమెరికాలో ప్రస్తుతం చికిత్స కోసం అక్కడే ఉంటున్నారని తెలుస్తుంది.విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా సమంత విజయ్ దేవరకొండ అర్ధరాత్రి సమయంలో వీడియోకాల్ చేసి మాట్లాడుకున్నారని ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ తనకు ఒక నాక్ నాక్ జోక్ చెప్పాలని ఫోన్ చేశానని చెప్పడంతో సమంత మాత్రం అర్ధరాత్రి ఒకటిన్నర సమయం అయింది.ఇప్పుడు జోక్ ఏంటి అంటూ ఆమె చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది అదేవిధంగా విజయ్ దేవరకొండ సమంతను చాలా మిస్ అవుతున్నాను అంటూ కూడా ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో కొందరు ఈ వీడియో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం అసలు వీరిద్దరు వీడియో కాల్( Video Call ) చేసుకోలేదని అది సెల్ఫీ వీడియో అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.