చంద్రయాన్3 కోసం చెల్లి పెళ్లికి కూడా వెళ్లని ప్రాజెక్ట్ డైరెక్టర్.. ఎంతో గ్రేట్ అంటూ?

చంద్రయాన్3( Chandrayaan 3 ) ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల కష్టం ఉంది.చంద్రయాన్3 సక్సెస్ కోసం రేయింబవళ్లు కష్టపడ్డామని కొంతమంది శాస్త్రవేత్తలు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.అయితే చంద్రయాన్3 కష్టపడిన వ్యక్తులలో పి.

 Shocking Facts About Chandrayaan3 Preoject Director Veeramuttuvel Details Here G-TeluguStop.com

వీరముత్తువేల్( P.Weeramuthuvel ) కూడా ఒకరు.ఈ మిషన్ కోసం వీర ముత్తువేల్ తన సొంత చెల్లి పెళ్లికి కూడా వెళ్లలేదు.

వీరముత్తువేల్ తండ్రి పళనివేల్( Palanivel ) ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.తన కొడుకు ఇంట్లో చెల్లి పెళ్లి ఉన్నా చంద్రయాన్3 మిషన్ కోసం మిషన్ పర్యవేక్షణ పనులతో నిమగ్నమయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.చంద్రయాన్3 మిషన్ మొదలైన రోజు నుంచి తన కొడుకు ఇంటికి రాలేదని చివరికి చెల్లి పెళ్లికి కూడా హాజరు కాలేకపోయాడని ఆయన కామెంట్లు చేశారు.

నా కొడుకు చంద్రయాన్3 ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డాడని కొడుకు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసినందుకు గర్విస్తున్నామని పళనిస్వామి వెల్లడించారు.చంద్రయాన్3 ప్రాజెక్ట్ కోసం 1000 మంది ఇంజనీర్లు పని చేశారు.వీరముత్తువేల్ గత నాలుగు సంవత్సరాలుగా చంద్రయాన్3 ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేయడం గమనార్హం.చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందిన వీరముత్తువేల్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు.

చంద్రయాన్2, మంగళ్ యాన్ మిషన్లలో కూడా వీరముత్తువేల్ పాల్గొన్నారని తెలుస్తోంది.వీరముత్తువేల్ భవిష్యత్తులో మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల కృషి ఫలితమే చంద్రయాన్3 అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చంద్రయాన్3 ప్రాజెక్ట్ సక్సెస్ కోసం కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేశారని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Chandrayaan director Veeramuthuvel

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube