ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చేతివాటం..అడ్డంగా బుక్కై చివరికి కటకటాల పాలు..!

ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎంతో దర్జాగా బతకొచ్చని చాలామంది కలలు కంటారనే విషయం అందరికీ తెలిసిందే.చదువుతోపాటు కాస్త అదృష్టం ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చాలామంది అభిప్రాయం.

 Rayadurgam Sbi Bank Manager Arrested For Fraudlent Transaction Of Money Details,-TeluguStop.com

కష్టపడి చదివి బ్యాంక్ ఉద్యోగం సంపాదించి నెలకు దాదాపుగా 60 వేల జీతం తీసుకునే ఒక బ్యాంక్ మేనేజర్( Bank Manager ) తన బాధ్యతలను దుర్వినియోగం చేసి ఖాతాదారుల డబ్బుపై కన్నేశాడు.ఖాతాదారుల డబ్బును తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న అకౌంట్లకు బదిలీ చేసుకొని తనకేం తెలియనట్లు సైలెంట్ గా ఉన్నాడు.

అతను కాజేసింది వేల, లక్షల రూపాయలు కాదు ఏకంగా కోటి రూపాయలు. ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరో.

అతనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎస్బీఐ బ్యాంకులో( SBI Bank ) సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్న ఫణి కుమార్( Phani Kumar ) దాదాపుగా ఖాతాదారుల అకౌంట్లో నుండి ఏకంగా కోటి రూపాయల వరకు కాజేశాడు అని ఉన్నత అధికారులకు తెలియడంతో ఫణి కుమార్ ను సస్పెండ్ చేశారు.

రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు రెండుందాలుగా ఏర్పడి మూడు ప్రధాన నగరాలలో గాలించి అరెస్టు చేశారు.

Telugu Anantapur, Bank Manager, Bankmanager, Rayadurgam, Sbi Bank-Latest News -

రాయదుర్గం టౌన్ లోని ఎస్బీఐ బ్యాంకులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్న పని కుమార్ రెండు నెలల క్రితం బ్యాంకు ఖాతాదారులకు చెందిన అకౌంట్లలోని డబ్బును( Bank Accounts ) తన తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ లోకి బదలాయించాడు.మొత్తం ఏకంగా రూ.10730023 రూపాయలను కాజేయడంతో బ్యాంకు ఉన్నత అధికారులు సస్పెండ్ చేయడంతో ఫణి కుమార్ పారిపోయాడు.

Telugu Anantapur, Bank Manager, Bankmanager, Rayadurgam, Sbi Bank-Latest News -

రాయదుర్గం పోలీసులు( Rayadurgam Police ) 2023 జూన్ 21న నిందితుడిపై కేసు నమోదు చేసి రెండు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.తాజాగా గురువారం విశాఖపట్నంలో నిందితుడు ఫణి కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టు చేసిన తర్వాత బదిలీ చేసిన ఖాతాదారుల సొమ్మును రికవరీ చేశారు.ఆ డబ్బులు తిరిగి మళ్లీ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్ లో జమ చేస్తామని బ్యాంక్ ఉన్నత అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube