తుది దశకు ఇండియా-యూకే ఎఫ్‌టీఏ చర్చలు : బ్రిటన్ మంత్రి

ఇండియా, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం( Free Trade Agreement ) (ఎఫ్‌టీఏ) కోసం జరుగుతున్న చర్చలు చివరి దశలో వున్నాయన్నారు యూకే స్టేట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ కెమీ బాడెనోచ్ .జీ20 దేశాల ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ మంత్రుల సమావేశం ఫలితాలపై ఆమె వ్యాఖ్యానించారు.భారత్, యూకే ప్రతిపాదిత ఎఫ్‌టీఏ కింద వ్యాపార చలనశీలత గురించి చురుకుగా చర్చిస్తున్నామని యూకే( UK ) మంత్రి చెప్పారు.వీసా సరళీకరణ సమస్యలు వాణిజ్య ఒప్పందాల పరిధిలోకి రావని ఆమె స్పష్టం చేశారు.

 India-uk Fta Talks In Final Stages, Business Mobility On The Table Says Britain-TeluguStop.com

ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, వ్యాపార చలనశీలతకు సంబంధించిన సమస్యలకు అనుగుణంగా ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని, తద్వారా ఇది రెండు దేశాలకు పనిచేస్తుందన్నారు.

Telugu Deadline Fta, Trade, Kemi Badenoch, Russia Ukraine-Telugu NRI

ఏదైనా చర్చలతోనే క్లిష్టమైన సమస్యలకు మార్గం దొరుకుతుందన్నారు.తాము ఇప్పటికే చాలా చాప్టర్‌లను ముగించామని.ఎఫ్‌టీఏపై డెడ్‌లైన్ ( Deadline on FTA )ఇవ్వలేనని, కానీ ఏదైనా జరగవచ్చని కెమీ బాడెనోచ్( Kemi Badenoch ) చెప్పారు.

ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా వుండేలా ఏదో ఒకటి అందించగలమని నిర్ధారించుకోవడానికి భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Telugu Deadline Fta, Trade, Kemi Badenoch, Russia Ukraine-Telugu NRI

రష్యా-ఉక్రెయిన్ ( Russia-Ukraine )యుద్ధంపై సభ్య దేశాల మధ్య విభేదాలు నెలకొన్న సందర్భంలో జరుగుతున్న జీ20 సమావేశాలపై ఆమె స్పందించారు.ఉక్రెయిన్ యుద్ధం.యూకే వాణిజ్యం, యూరోపియన్ వాణిజ్యం, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

ప్రస్తుతం జైపూర్‌లో జరుగుతున్న జీ20 దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం నిమిత్తం భారత్‌కు వచ్చిన బాడెనోచ్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.ఇక్కడ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీలో వ్యాపార ప్రతినిధులు, కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీకానున్నారు.

ప్రతిపాదిత ఎఫ్‌టీఏ కోసం భారత్, యూకే మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.ఇరు దేశాలు పెట్టుబడి ఒప్పందాలు, నియమాలు, మేథో సంపత్తి హక్కులు, ఇతర సమస్యలపై విభేదాలను తొలగించాలని చూస్తున్నాయి.

ప్రతిపాదిత ఎఫ్‌టీఏలోని మొత్తం 26 చాప్టర్‌లలో పందోమ్మిదిని ఇరు దేశాలు క్లోజ్ చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube