యూకేలోని డెర్బీలో( Derby, UK ) ఆదివారం సాయంత్రం జరిగిన ఒక కబడ్డీ మ్యాచ్ హింసాత్మకంగా మారింది.రెండు ప్రత్యర్థి ముఠాలు తాగేసి తీవ్రమైన భౌతిక దాడికి దిగాయి.
ఫలితంగా ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.డెర్బీషైర్‌లోని అల్వాస్టన్‌లోని డెర్బీ కబడ్డీ గ్రౌండ్స్‌లో( Derby Kabaddi Grounds ) మధ్యాహ్నం 3:50 గంటలకు ఈ ఘటన జరిగింది.స్థానిక ప్రాంతానికి చెందిన వారిగా భావిస్తున్న రెండు ముఠాలు తుపాకులు, కత్తులతో సహా హాకీ స్టిక్స్‌తో పాటు ఇతర ఆయుధాలతో ఘర్షణకు దిగాయని పోలీసులు తెలిపారు.
ఒక దుండగుడు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి, ఆపై పదే పదే కత్తితో దాడి చేశాడని, తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘర్షణల్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు.పోలీసులు సంఘటనా స్థలానికి రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, అధికారులు ఘటనా స్థలంలో మరికొంత కాలం ఉండే అవకాశం ఉంది.
టోర్నమెంట్‌ను నిర్వహించిన ఇంగ్లాండ్ కబడ్డీ ఫెడరేషన్( England Kabaddi Federation ) హింసను ఖండిస్తూ, ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.దీనిపై విచారణ జరిపేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తామని ఫెడరేషన్ తెలిపింది.కబడ్డీ మ్యాచ్ ఇంగ్లాండ్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహిస్తున్న వరుస మ్యాచ్‌లలో భాగంగా జరిగింది.స్థానిక డెర్బీ జట్టు, గురు అర్జన్ దేవ్ గురుద్వారా కబడ్డీ క్లబ్, 30 సంవత్సరాలుగా కబడ్డీ ఆటలో పాటిస్పేట్ చేస్తోంది.@Sangha2Bs అనే ట్విట్టర్ హ్యాండిల్ కబడ్డీ ప్లేయర్స్ కొట్టుకున్న దృశ్యాలను వీడియోల రూపంలో పోస్ట్ చేసింది.ఈ దాడికి పాల్పడిన వారిలో సాధారణ సిక్కు ప్రజలు, హిందూ పంజాబీ ప్రజలు ఉన్నట్లు ఆ పేజీ తెలిపింది.