ఇక్కడ చాలామందికి కాఫీ( Coffee ) గొంతులో పడనిదే రోజు మొదలవ్వని పరిస్థితి ఉంటుంది.అంతలాగ మనం కాఫీ, టీలకు అడిక్ట్ అయిపోయాం.
ఇంకా చెప్పాలంటే ఈ పానీయాలు మన దైనందిత జీవితంలో ఒక భాగం అయిపోయాయి.ఓ కప్పు కాఫీ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుందని మనలో చాలామంది ఫీల్ అవుతూ వుంటారు.
కాస్త టైడ్ గా వున్నపుడు అలా బయటకు వెళ్లి వేడివేడి కాఫీని గొంతులో వేసుకుంటే వుంటుందీ… నా సామీ రంగ, న భూతొ న భవిష్యతి.అవును, దీనిని కేవలం డ్రింక్ గా కాదు, దాన్నొక ఎమోషన్ లా ఫీలయ్యేవాళ్లూ చాలామంది ఉన్నారు.
అయితే కాఫీ అనేది మనదగ్గరకు రావడం వరకూ చాలా పెద్ద హిస్టరీనే ఉంది.క్రీ.శ.తొమ్మిదో శతాబ్దంలో ఇథియోపియా( Ethiopia )లో పుట్టిన కాఫీ దేశ దేశాలు దాటి ప్రపంచమంతా పాకి మనదేశానికి కూడా వచ్చింది.కాఫీని మొదటిసారి రుచి చూసింది మనిషి కాదు, గొర్రెలని మీకు తెలుసా? అవును, ఇథియోపియాలోని కాల్దీ అనే గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకొని ఒక కొండ ప్రాంతానికి వెళ్లి.అక్కడ గొర్రెలను పచ్చగడ్డి మేసేందుకని వదిలి పెట్టగా కాసేపటి ఆ గొర్రెలన్నీ వింతగా గెంతుతూ కనిపించాయట.
అప్పుడే అతను గొర్రెలు( Sheep ) ఎదో కొత్తరకం ఆకుల్ని తిని ఉంటాయని అనుకున్నాడు.
ఆ మరుసటి రోజు గొర్రెలు మేసిన ప్రాంతానికి వెళ్లి చెట్లన్నీ వెతకగా అక్కడ ఎర్రని రంగు కలిగిన బెర్రీస్( Berries ) ని కనుగొన్నాడు.వెంటనే వాటిని తీసుకుని నోట్లో వేసుకోగా ఈ గింజల్లో ఏదో మ్యాజిక్ ఉందని అనిపించిందట.ఆ తరువాత వాటి గురించి ఎవరికైనా తెలుసేమో అని ఊరంతా అడగగా ఎవ్వరూ వాటి గురించి తెలియదని చెప్పారు.
చివరగా అక్కడుండే కొంతమంది సాధువులకు ఆ గింజలు ఇస్తే.వాళ్లు ఆ గింజలను మరిగించి డ్రింక్ లా తయారు చేసి, సేవించారట.అదే మనిషి మొదటిసారి తాగిన కాఫీ. కాఫీ రుచి తెలిసిన తర్వాత ఆ గింజలను సేకరించి ప్రత్యేకంగా సాగు చేయడం అక్కడినుండే మొదలైంది.