2001వ సంవత్సరం ఎస్.జె.
సూర్య దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ రొమాంటిక్ మూవీ ఖుషి ( Khushi ) ఎంత పెద్ద హిట్ అయిందో సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) భూమిక నటనకి చాలామంది ఫిదా అయ్యారు.
ఖుషి సినిమాకి మణిశర్మ ( Manisharma ) మ్యూజిక్ కూడా ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య గొడవ, రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
అయితే ఖుషి సినిమా అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తుకు వచ్చేది భూమిక నడుము సీన్ మాత్రమే.ఈ సినిమాలో భూమిక నడుము సన్నివేశం ఎంతగా హిట్ అయింది అంటే ఇదే సన్నివేశాన్ని చాలామంది హీరోలు తమ సినిమాల్లో కూడా పెట్టుకున్నారు.

అయితే భూమిక నడుము సన్నివేశం ఇంతలా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ చెప్పిన ఒక ఐడియానట.అదేంటంటే ఈ సన్నివేషంలో భూమిక ( Bhumika ) నడుము సీన్ ఎలాగైనా సరే చూసేవాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వాలని భూమిక కి పియర్స్ సోప్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు.కానీ ఈ సన్నివేశం తెరకెక్కించే టైం కి నీ నడుము చాలా షైనింగ్ గా కనిపించాలి.చూస్తే తళతళా మెరిసిపోవాలి అంటూ డైరెక్టర్ చెప్పారట.

దాంతో భూమిక పియర్స్ సోప్ తీసుకుని నడుముని చాలాసేపు వాష్ చేసి సన్నివేశం తెరకెక్కించే టైంకి తన నడుము చాలా షైనింగ్ గా కనిపించేలా చేసుకుందట.ఇక డైరెక్టర్ షూట్ తీసేసరికి భూమిక నడుము ఆ సన్నివేశంలో చాలా హైలెట్ అయింది.దాంతో ఈ సీన్ సినిమాకే హైలెట్ సన్నివేశంగా నిలిచింది.ఇక ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో భూమిక నడుముకి చాలామంది అభిమానులు ఉన్నారు.ఇలా భూమిక నడుము సన్నివేశం వెనుక పియర్స్ సోప్ ఉంది అంటూ ఈ విషయాన్ని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.